మేకను దొంగతనం చేశారనే నెపంతో ఓ దళిత యువకుడిని, పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన సంఘటన కలకలం రేపింది. తాజాగా ఈ ఘటన పై బీఎస్పీ(BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen kumar) స్పందించారు. ” తెలంగాణలో ఆటవిక రాజ్యం ఆనవాళ్లు’’ అంటూ ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
అసలేం జరిగిందంటే.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములుకి చెందిన మేకల మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైర్గా మారింది.