జీ-20 సమావేశాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్(Security protocal) ఉల్లంఘన వెలుగు చూసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(జీ-20) కాన్వాయ్‌లోని(convoy) ఓ డ్రైవర్ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ బస చేస్తున్న తాజ్ హోటల్ లోకి జో బైడెన్ కాన్వాయ్ లోని కారు ఒకటి ఎంటర్ అయింది. దీంతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఆ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందని డ్రైవర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తాను బైడెన్ బస చేస్తున్న మౌర్య హోటల్ కు ఉదయం 9.30 గంటలకు వెళ్లాల్సి వుందని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కానీ ఈలోపు లోధి ఎస్టేట్ నుంచి కొంత కస్టమర్లను తాజ్ హోటల్ వద్ద డ్రాప్ చేసేందుకు వచ్చినట్టు ఆ డ్రైవర్ వెల్లడించారని పేర్కొన్నారు.
కారును ఆపిన సమయంలో అందులో వ్యాపార వేత్త ఒకరు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ గురించి తనకు తెలియదని డ్రైవర్ చెప్పినట్టు తెలిపారు. దీంతో ఆ డ్రైవర్ ను పోలీసులు విడిచి పెట్టారు. వెంటనే అతన్ని జో బైడెన్ కాన్వాయ్ నుంచి తొలగించారు. జీ-20 సదస్సు సందర్భంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జీ-20 సదస్సుకు అంతర్జాతీయ నేతలు హాజరవుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివిధ దేశాల అధ్యక్షులు యూపీలోని హిండెన్ ఎయిర్ పోర్టులో దిగనుండటంతో అక్కడ సుమారు 2 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జీ-20 నేతల భద్రత కోసం ఫైటర్ జెట్లు, డ్రోన్స్, పారామిలటరీ దళాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.