Mahendragiri, A War ship: యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’
శత్రుదేశ రాడార్లకు చిక్కని సామర్థ్యం కలిగిన యుద్ధనౌక (INS Warship) ‘మహేంద్రగిరి’ (Mahendragiri) జల ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ తరహా ఆరు యుద్ధనౌకలను భారత నౌకదళం (Indian Navy) రూపొదించింది. ఇది ఏడవది. ఈ ఏడు యుద్ధ నౌకల తయారీ కోసం భారత నౌకదళం ‘ప్రాజెక్టు 17ఏ’ (Project 17A) 2019లో ప్రారంభించింది.
దేశంలోనే సహజ సిద్ధమైన అటవీ వనరులకు పేరు పొందినవి మహేంద్రగిరి పర్వతాలు. ఒడిశాలో ఉన్న మహేంద్రగిరి పర్వతాల పేరుతో తయారైన ఈ యుద్ధనౌకను ఉప రాష్ట్రపతి జగదీప్ ధనడ్ (Jagdeep Dhankar) సతీమణి సుదేశ్ ధనఖడ్ చేతుల మీదుగా ముంబయి తీరంలో జలప్రవేశం చేయించారు.
దీంతో భారత నౌకదళంలోకి మరో అత్యధునిక యుద్ధనౌక వచ్చి చేరినట్లైయ్యింది. ముంబాయిలోని మజగావ్ డాక్ షిబిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ యుద్ధనౌకను నిర్మించింది. ఈ యుద్ధనౌకల ప్రాజెక్టు 17ఏ కోసం 75 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారని భారత నౌకదళం తెలిపింది.
భారత నౌకాదళ స్వావలంబన దిశగా మనం సాధించిన అద్భుతమైన పురోగతికి ‘మహేంద్రగిరి’ ఒక నిదర్శనమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్డ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పాల్గొన్నారు.