Telugu News » Mahendragiri, A War ship: యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’

Mahendragiri, A War ship: యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’

భారత నౌకదళంలోకి మరో అత్యధునిక యుద్ధనౌక వచ్చి చేరినట్లైయ్యింది. ముంబాయిలోని మజగావ్ డాక్ షిబిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ యుద్ధనౌకను నిర్మించింది.

by Prasanna

Mahendragiri, A War ship: యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’

శత్రుదేశ రాడార్లకు చిక్కని సామర్థ్యం కలిగిన యుద్ధనౌక (INS Warship) ‘మహేంద్రగిరి’ (Mahendragiri) జల ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ తరహా ఆరు యుద్ధనౌకలను భారత నౌకదళం (Indian Navy) రూపొదించింది. ఇది ఏడవది. ఈ ఏడు యుద్ధ నౌకల తయారీ కోసం భారత నౌకదళం ‘ప్రాజెక్టు 17ఏ’ (Project 17A) 2019లో ప్రారంభించింది.

దేశంలోనే సహజ సిద్ధమైన అటవీ వనరులకు పేరు పొందినవి మహేంద్రగిరి పర్వతాలు. ఒడిశాలో ఉన్న మహేంద్రగిరి పర్వతాల పేరుతో తయారైన ఈ యుద్ధనౌకను ఉప రాష్ట్రపతి జగదీప్ ధనడ్ (Jagdeep Dhankar) సతీమణి సుదేశ్ ధనఖడ్ చేతుల మీదుగా ముంబయి తీరంలో జలప్రవేశం చేయించారు.mahendra giri navy

దీంతో భారత నౌకదళంలోకి మరో అత్యధునిక యుద్ధనౌక వచ్చి చేరినట్లైయ్యింది. ముంబాయిలోని మజగావ్ డాక్ షిబిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ యుద్ధనౌకను నిర్మించింది. ఈ యుద్ధనౌకల ప్రాజెక్టు 17ఏ కోసం 75 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారని భారత నౌకదళం తెలిపింది.

భారత నౌకాదళ స్వావలంబన దిశగా మనం సాధించిన అద్భుతమైన పురోగతికి ‘మహేంద్రగిరి’ ఒక నిదర్శనమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్డ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పాల్గొన్నారు.

You may also like

Leave a Comment