హైదరాబాద్ (hydearabad) లో నిత్యం ఏదోక మూల మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా ఉంచినప్పటికీ కూడా నగరంలోకి ఏదోక విధంగా మత్తు పదార్థాలు ప్రవేశిస్తున్నాయి. మాధపూర్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ (raveparty) జరిగింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ ఓ నిర్మాతతో (producer)పాటు ఐదుగురు ప్రముఖులను అరెస్టు చేశారు.
మాధాపూర్(madhapur) పరిధిలోని విఠల్‌రావ్ నగర్లో వైష్ణవి అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరిగింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది విషయాన్ని తెలుసుకొని దాడి చేసింది. ఈ దాడిలో భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు. భారీగా కొకైన్, ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు. సినీ ప్రముఖులను కూడా పట్టుకున్నారు. నిర్మాత వెంకట్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు.
పోలీసుల రైడ్‌లో సినీ నిర్మాత వెంకట్‌తోపాటు బాలాజీ, కె. వెంకటేష్‌రెడ్డి, డి. మురళి, మధుబాల,మేహక్నుఅరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన కొకైన్, ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో కొందరు టాలీవుడ్‌కు సంబంధించిన యువతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం దీనిపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
గతంలో కూడా నిర్మాత వెంకట్‌పై ఆరోపణలు వచ్చాయి. అందుకే అప్పటి నుంచి ఆయనపై కన్నేసి ఉంచారు పోలీసులు. ఈ నిఘాకు ఇప్పుడు చిక్కుకున్నాడు వెంకట్. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అసలు వీళ్లకు మత్తు పదార్థాలను సప్లై చేసింది ఎవరు? ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు.
నెట్‌వర్క్‌ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం చిక్కిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో కొందరికి మాదక ద్రవ్యాల కేసుల్లో మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో ఉండే నెంబర్లు, తరచూ ఫోన్లో మాట్లాడే వారి వివరాలు తెలుసుకుంటున్నారు.