తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించిన తరువాత పార్టీ వర్గాల్లో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లా సీటును కేసీఆర్ సస్పెన్షన్‌లో పెట్టడంతో బీఆర్ఎస్ కి చెందిన కొందరు నేతలు అసంతృప్తతితో ఉన్నారు.
ఈ క్రమంలో ఆ స్థానాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి (madan reddy) కేటాయించాలని కోరుతూ మంత్రి హరీశ్ రావు(hareesh rao) ఇంటి ముందు నర్సాపూర్ (narsapur) అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో నర్సాపూర్ కూడా ఒటకి. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మదన్ కి అవకాశం ఇవ్వాలంటూ కార్యకర్తలు కోరారు.
మదన్ రెడ్డి కూడా సీటు తనకి ఇవ్వని పక్షంలో రాజీనామా చేస్తానని ఇంతకు ముందే ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ (brs) పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలోని బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు మదన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ నెల 21న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి(suneetha lakshma reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha)ను కలిశారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. ఈ జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆర్. అయితే నర్సాపూర్ టికెట్ మదన్‌రెడ్డికి కేటాయించాలని ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు డిమాండ్ చేశారు.
మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి హరీశ్ రావును కలిసేందుకు మదన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు