Aditaya l1: భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1(Aditya l1) లక్ష్యం దిశగా దూసుకు పోతోంది. తాజాగా ఆదిత్య ఎల్-1 మూడవ కక్ష్యను(third eath bound maneuver) విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. మారిషస్, బెంగళూరు, పోర్టు బ్లేయర్ నుంచి ఈ శాటిలైట్ ఆపరేషన్ ను ట్రాక్ చేస్తున్నట్టు ఇస్రో వెల్లడించింది.
అదే సమయంలో నాలుగవ కక్ష్య పెంపు గురించి ఇస్రో(isro) వెల్లడించింది. సెప్టెంబర్ 15న నాల్గవ సారి కక్ష్య పెంపును చేపట్టనున్నట్టు ఇస్రో పేర్కొంది. మొత్తం ఐదు సార్లు కక్ష్యను పెంచనున్నట్టు ఇస్రో వెల్లడించింది. అనంతరం ఎల్-1 రేంజ్ ప్రవేశ పెట్టనున్నట్టు ఇస్రో ఇప్పటికే పేర్కొంది.
ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 296 కి.మీ/ 71,767 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నట్టు ఇస్రో పేర్కొంది. ఆదిత్య ఎల్-1ను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. ఇందులోని ఏడు పే లోడ్స్ సూర్యుని గురించి సమగ్రంగా అధ్యయనం చేయనున్నాయి.
అందులో మూడు పే లోడ్స్ సూర్యుని నుంచి వచ్చే కాంతిపై పరిశోధనలు చేయనున్నాయి. మిగిలిన నాలుగు పేలోడ్స్ ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల గురించి సమాచారాన్ని ఇస్రోకు అందించనున్నాయి. అంతకు ముందు ఆదిత్య ఎల్ 1 మొదటి కక్ష్య పెంపును సెప్టెంబర్-3న ఇస్రో చేపట్టింది. అనంతరం సెప్టెంబర్-5న రెండో సారి కక్ష్య పెంపును ఆదిత్య ఎల్-1 విజయవంతంగా పూర్తి చేసింది.