Telugu News » Posani : ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్.. పోసానిపై కేసు నమోదు!

Posani : ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్.. పోసానిపై కేసు నమోదు!

రాజమండ్రి పోలీస్ స్టేషన్‌ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు గతంలో ఫిర్యాదు చేశారు.

by admin

చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో వారికి వైసీపీ (YCP) నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) కూడా వాళ్లకు తోడయ్యారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని ప్రశ్నిస్తూ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పైనా విరుచుకుపడ్డారు. అయితే.. గతంలోనూ పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఇదే క్రమంలో ఆయనపై తాజాగా కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.

రాజమండ్రి పోలీస్ స్టేషన్‌ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. పోసానిపై కేసు నమోదు ఎందుకు చేయరంటూ హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే కేసు పెట్టాలని ఆదేశించింది. దీంతో చేసేదేంలేక కోర్టు ఆదేశాలతో పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

సోమవారం మీడియాతో మాట్లాడిన పోసాని.. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమని, ఆయన చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాడని విమర్శించారు. కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్ తో డ్రామా ఆడుతున్నారని, తిట్టారని మర్చిపోయి ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ని కలిశారని భువనేశ్వరి, బ్రాహ్మణిలను టార్గెట్ చేశారు. అత్తా కోడలు కలిసి పవన్ ను ఐస్ చేశారని పేర్కొన్నారు.

పవన్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో గతంలో వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం.. పోసానిపై కేసు నమోదు కావడం జరిగాయి. దీంతో జనసేన శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

You may also like

Leave a Comment