Telugu News » Chittoor : హిందూ ఆలయ పుష్కరిణిలో బాప్తిజం..!

Chittoor : హిందూ ఆలయ పుష్కరిణిలో బాప్తిజం..!

హిందువులు ఎంతో పవిత్రంగా పూజించి స్నానమాచరించే స్కంద పుష్కరణిలో మత మార్పిడి చేస్తూ కనిపించారు. ఇది గమనించిన స్థానికులు కొందరు అక్కడికి చేరకుని క్రైస్తవులను నిలదీశారు.

by admin
religious-conversion-in-chittoor

– ఆలయ పరిసరాల్లో బరితెగింపు
– టీటీడీ స్కంద పుష్కరిణిలో అపచారం
– హిందువులను మత మార్పిడి చేస్తూ కనిపించిన క్రైస్తవులు
– అడ్డుకున్న స్థానికులు, బీజేపీ శ్రేణులు
– పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రా (Andhrapradesh) లో జగన్ (Jagan) సర్కార్ వచ్చాక హిందూత్వంపై విచ్చలవిడిగా దాడి జరుగుతోందనే అపవాదు ఉంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల కూల్చివేత, రథాల కాల్చివేత, విచ్చలవిడి మతమార్పిడులు, దేవాదాయ శాఖ అనాలోచిత నిర్ణయాలు.. ఇలా అనేక అంశాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా చిత్తూరు (Chittoor) జిల్లాలో జరిగిన సంఘటన దీనికి అద్దం పడుతోంది. హిందువులు (Hindu) ఎంతో పవిత్రంగా భావించే ఆలయ పుష్కరిణిలో బాప్తిజం చేస్తూ కనిపించారు క్రైస్తవులు.

religious-conversion-in-chittoor

హిందువులను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి మార్చుతున్నారని హిందూ సంఘాలు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాయి. అయినా కూడా పాలకుల్లో చలనం ఉండడం లేదని… విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని… దాని ప్రభావమే.. టీటీడీకి చెందిన పుష్కరిణి మత మార్పిడికి అడ్డాగా మారడానికి కారణమైందని అంటున్నాయి హిందూ సంఘాలు. కార్వేటినగరం మండలంలో టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ స్కంద పుష్కరిణి ఉంది. ఇందులో మత మార్పిడికి తెరలేపారు క్రైస్తవులు.

హిందువులు ఎంతో పవిత్రంగా పూజించి స్నానమాచరించే స్కంద పుష్కరణిలో మత మార్పిడి చేస్తూ కనిపించారు. ఇది గమనించిన స్థానికులు కొందరు అక్కడికి చేరకుని క్రైస్తవులను నిలదీశారు. వారు బరితెగించి మాట్లాడడంతో వాగ్వాదం జరిగింది. హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ విషయం పోలీసులకు తెలిసి స్పాట్ కు చేరుకుని క్రైస్తవులను పంపించేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. బలవంతంగా మత మార్పిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శ్రీశైలంలో ముస్లింలకు షాపులు కేటాయించడంపై వివాదం నడుస్తోంది. దేవాదాయ శాఖ తీరును తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు. ఇదే సమయంలో టీటీడీ స్కంద పుష్కరిణిలో బాప్తిజం చేస్తూ క్రైస్తవులు కనిపించడం దేవాదాయ శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోందని మండిపడుతున్నాయి.

You may also like

Leave a Comment