డ్రైవరన్నలు కాస్త జాగ్రత్త..ముఖ్యంగా ఆర్టీసీ అన్నలు..జర భద్రం.టాయిలెట్ కి వెళ్లినా, ఛాయ్ కి పోయినా మీరు నడిపే బస్సు మీద ఒకటీ రెండూ కాదు..వెయ్యికళ్లేసి ఉంచండి.ఎందుకంటే..బస్ దొంగలున్నారు. బస్సెవరు దొంగిలిస్తారనుకోకండి..!
తెలంగాణ(Telangana)లో ఓవింత చోరీ జరిగింది. ఏదో చెంబు, చేట దొంచగిలించినట్టుగా ఏకంగా ఆర్టీసి బస్సుని దొంగిలించాడు.దొంగిలించడం అంటే ఏదో ఉత్తగా కాదు…ప్రయాణికులతో బస్సును ఎత్తుకుపోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం..సిద్ధిపేట(Siddipet) బస్ స్టాండ్ లో ఈ రోజు ( సెప్టెంబర్ 11) ఆర్టీసీ బస్సును చోనీ చేశాడు.
ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి.. సదరు బస్సు డ్రైవర్(Bus driver), కండక్టర్ కు షాకిచ్చాడు. అయితే బస్సును జిల్లెళ్ల క్రాసింగ్ వద్దకు తీసుకురాగానే రోడ్డుపై నుంచి గుంతలోకి తీసుకెళ్లాడు.దీంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి.. నువ్వు ఆర్టీసీ డ్రైవర్ వేనా అని నిలదీశారు. అసలు నిజం తెలుసుకున్న ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆ దొంగెవరోగానీ పోలీస్ స్టేషన్లో కాదు, మ్యూజియంలో పెట్టాలంటున్నారు విషయం తెలుసుకున్న జనం.