Telugu News » School Bus : 40 మంది విద్యార్థులున్న స్కూల్ బస్ స్టీరింగ్ పని చేయలేదు…ఆ తర్వాత…

School Bus : 40 మంది విద్యార్థులున్న స్కూల్ బస్ స్టీరింగ్ పని చేయలేదు…ఆ తర్వాత…

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తోంది. ఇంటింటికి వెళ్లి విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని స్కూల్ కు బయలుదేరుతుంది.

by Prasanna
school bus

వికారాబాద్ (Vikarabad) జిల్లా సుల్తాన్‌పూర్‌లో స్కూల్ బస్ (School Bus) ప్రమాదానికి (Bus Accident) గురైయ్యింది. ఈ బస్సు నేరుగా నీటి కుంటలోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. ఈ ప్రమాదానికి గురైంది ఒక ప్రైవేటు స్కూల్ బస్సు. అసలు ఏం జరిగిందంటే…

school bus

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తోంది. ఇంటింటికి వెళ్లి విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని స్కూల్ కు బయలుదేరుతుంది. ఇది రోజూ జరిగేదే. ఎప్పటిలాగే ఈ రోజు కూడా స్కూల్ నుంచి విద్యార్థులను ఎక్కుంచుకుంటూ వెళ్తోంది. అలా విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న బస్సు మార్గ మధ్యలో సుల్తాన్​పూర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది.

దాంతో ఒక్కసారిగా భయానికి గురైన విద్యార్థులు పెద్దగా కేకలేశారు. ఇది చూసిన చుట్టుపక్కల వారు, వాహనదారులు ఆగి బస్సులోని విద్యార్థులను బయటకు తీశారు. బస్సులో ఉన్న 40 మందిని బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో విద్యార్థులెవరికీ ఏం జరగలేదు. స్టీరింగ్‌ సరిగా పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తమ పిల్లలకేదైనా జరిగిందేమోనని ఆందోళన చెందారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. బస్సు మెయింటనెన్స్ బాగోలేదని, స్టీరింగ్ పని చేయకపోవడమేంటని యాజమాన్యాన్ని నిలదీశారు. రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.

 

You may also like

Leave a Comment