షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత
కామారెడ్డి (Kamareddy) నుంచి కేసీఆర్ (KCR) పోటీ చేస్తే ఓటమి ఖాయం. ఖచ్చితంగా ఓడించి తీరుతాం. కాంగ్రెస్ (Congress) జెండా ఎగురవేస్తాం. హుజూరాబాద్ లో 10 లక్షలు ఇచ్చినట్లు కామారెడ్డిలో కూడా ఇవ్వాలి. ఓటమి భయం వల్లే గంప గోవర్ధన్ (Govardhan).. కేసీఆర్ ను పోటీ చేయమని అడుగుతున్నారు. ఎవరు వచ్చినా ఓటమి తప్పదు.
కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికీ నేను కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. కేసీఆర్ కట్టిస్తానన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. గులాబీ నేతలు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారు. వారిని ఇంకా ప్రశ్నించాలి. మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తాం.
ప్రజల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. యువ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలను కలుస్తూ వారిని చైతన్యం చేయాలి. వ్యాధులతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్రంలో పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఏ శాఖ కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆరోగ్య శాఖ పరిస్థితి అయితే.. మరింత అధ్వాన్నంగా తయారైంది.
అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడాలి. ఈసారి రాబోయేది మన ప్రభుత్వమే. అందరం సమిష్టిగా కష్టపడదాం. అనుకున్నది సాధిద్దాం.