Telugu News » Liquor Scam : సిసోడియాకు చుక్కెదురు.. కవిత నిర్ణయంపై ఉత్కంఠ..!

Liquor Scam : సిసోడియాకు చుక్కెదురు.. కవిత నిర్ణయంపై ఉత్కంఠ..!

బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అనుమతించిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు.

by admin

ఢిల్లీ లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కు చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసినట్లు ఢిల్లీ (Delhi) హైకోర్టు పేర్కొంది. తన భార్యకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ గతంలో సిసోడియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అనుమతించిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ (CBI) అధికారులు సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఆమె ప్రగతి భవన్‌ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)తో చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తన లీగల్ టీం తో కవిత చర్చలు జరుపుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కవిత విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కవితకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి.

You may also like

Leave a Comment