తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా వేడిగాలుల(HOT Waves) తీవ్రత పెరిగింది. ఏప్రిల్ నెల ప్రారంభానికి ముందే భానుడు(SUN) తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జనాలు బయట తిరగడం మానుకోవాలని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఎండ వేడివి అధికంగా ఉన్న సమయాల్లో తమ పనులు పోస్టు పోన్ చేసుకుంటే మంచిదని పేర్కొంది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రోజుల వ్యవధిలోనే ఎండ వేడిమి తీవ్రత ఏకంగా 3 డిగ్రీలు పెరిగిపోతుందని..ఉష్ణ్రోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, ములుగు జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని స్పష్టంచేసింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళితే జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.ఇదిలాఉండగా, వేసవిలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఎప్పటికప్పుడు తగినన్నీ వాటర్ తీసుకోవాలని, పండ్ల జ్యూసెస్ తీసుకుంటే కాస్త ఉపశమనం పొందవచ్చని హెల్త్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.