చిన్నతనంలో మనందరం భారతదేశ చరిత్ర చదువుకునే ఉంటాం. అందులో ఎక్కడ చూసినా మొగలుల చరిత్ర, విదేశీ చొరబాటు దారుల గొప్పతనం మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్బర్, బాబర్, ఘజినీ, టిప్పు సుల్తాన్, అలెగ్జాండర్ ఇలాంటి వ్యక్తుల వీరత్వాలతో మన చరిత్రను నింపేశారు. నిజానికి వీరంతా భారతీయులు కాదు.విదేశాల నుంచి భారత భూమిపై అడుగుపెట్టి ఇక్కడి అసలు సిసలైన సంపదను, సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వ కట్టడాలను, వేల ఆలయాలను ధ్వంసం చేసిన క్రూరులు. భవిష్యత్ తరాలకు మన పురాతన మార్గదర్శకుల మూలాలను లేకుండా చేసిన వారు. కానీ మన పాలకులు అసలైన చరిత్రను కాలరాసి వీరు చేసిన విధ్వంసాన్ని మన చరిత్ర పుటల్లో నింపేసింది.
ఫలితంగా నేటితరం పిల్లలకు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న సైన్స్, మన సంస్కృతి, భారతదేశ మార్గదర్శకులు మనకు ఏం చెప్పారో వాటి గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు విదేశీయుల గొప్పతనాన్ని పొగుడుతూ వారికి బానిసత్వం చేస్తుంటారు. అయోధ్యలో రామాలయాన్ని కూల్చిన 500 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మళ్లీ అక్కడ 2023 జనవరిలో రాముడి జన్మస్థలంలో కొత్త రామాలయం నిర్మించి ప్రారంభించారు. నేటితరం వారికి అది కేవలం ఆలయంగానే కనిపిస్తుంది. కానీ, ఆలయం కూల్చినప్పటి నుంచి అక్కడ కొత్త మందిరం నిర్మాణానికి ఎందుకు 500 ఏళ్లు పట్టింది. ఎంత మంది దానికోసం ప్రాణాలు అర్పించారు అనేది నేటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు.
అయోధ్యలో రామాలయం విధ్వంసానికి గురైనట్లే యూపీలోని కాశీలో విశ్వనాథ్ మందిరం కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సార్లు విధ్వంసానికి గురైంది. మన చరిత్రలో గొప్పగా చెప్పుకొచ్చిన మొగలులు, సుల్తానులే దానికి కారణం. ఇక్కడి సంపదను దోచుకుని పోవడంతో పాటు వేల సంఖ్యలో ఆలయాలను కూల్చి అందులోని విలువైన సంపదను కొల్లగొట్టారు. అయితే, కాశీవిశ్వనాథ్ ఆలయాన్ని సంరక్షించుకోవడానికి సనాతన ధర్మాన్ని పాటించే 40వేల మంది నాగసాధువులు చేతుల్లో ఎలాంటి ఫిరంగులు, తుపాకులు, కత్తులు లేకుండా మొగల్ సైనాన్ని మట్టికరిపించారని ఎవరైనా తెలుసా? తెలీదు.. ఎందుకంటే చరిత్రలో వీరికంటూ ఒక పేజీ లేకుండా చేసేసారు ఆనాటి పాలకులు. (1664 నుంచి 1669) మధ్యకాలంలో కాశీ మందిరం మూడు సార్లు విధ్వంసానికి గురైంది.
అప్పట్లో మనదేశానికి వలసొచ్చిన చొరబాటు దారులు ముందుగా ఇక్కడి సంపదపై, ఆలయాలపై విధ్వంసంపై కన్నేశారు. ఈక్రమంలోనే క్రీ.శ.1194లో మొహమ్మద్ ఘోరీ జనరల్ అయిన కుతుబ్ ఉద్దీన్ ఐబాక్ తొలిసారి కాశీ మందిరాన్ని కూల్చాడు.అనంతరం ఆలయాన్ని మళ్లీ పునర్మించాక జౌన్‌పూర్ సుల్తాన్, సికందర్ లోధి టర్కీ పాలకులు మళ్లీ నాశనం చేశారు. కాగా, 1500సంవత్సరం చివరలో రాజా తోడర్ మల్ కాశీ ఆలయాన్ని మరల పునరుద్ధరించారు.
అనంతరం క్రూరుడైన ఔరంగజేబు 1664లో ఆలయాన్ని విధ్వంసం చేశాడు. ఆ సమయంలో మహానిర్వాణి అఖారాకు చెందిన నాగ సాధువులు ఔరంగజేబు సైనాన్ని దీటుగా ఎదుర్కొని వారిని ఓడించారు. మళ్లీ 1669లో మొఘల్ సైన్యం రెండోసారి దండయాత్ర చేసింది. ఈసారి 40 వేల మంది నాగసాధువులు తమ ప్రాణాలను అర్పించి ఆలయ పవిత్రతను కాపాడారు. కానీ ఆలయంలో సగభాగాన్ని ఆక్రమించారు.
1780లో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న కాశీ విశ్వనాథ్ మందిరాన్ని అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇది నేటికీ మసీదు ఉన్న అసలు కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉంది. కాశీ ఆలయ అసలైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం న్యాయపోరాటం జరుగుతోంది. ఒకవేళ ఆ స్థలం కాశీ మందిరానికి చెందుతుందని కోర్టు తీర్పు ఇస్తే ఆనాడు మందిరం కోసం ప్రాణాలు అర్పించిన 40వేల మంది నాగసాధువులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది. అయితే, క్రూరులైన మొగల్ సైన్యంతో త్రిశూలం, కర్రలు, శంఖంలతో పోరాడిన నిజమైన వీరులకు మన చరిత్రలో ఒక పేజీ అంటూ లేకపోవడం నేటితరం ఆలోచించాల్సిన విషయం. దేశానికి స్వాతంత్రం వచ్చాక కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలోని మన పాలకులే అసలైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందకుండా చేశారంటే వారి ఆలోచన విధానం, విదేశీ దుష్టశక్తుల మీద వారికున్న గౌరవాన్ని బట్టి ఇట్టే అర్థం అయిపోతుంది వారు దేశాన్ని ప్రేమించే వారా? లేక విధ్వంసం చేసేవారా? అని.. దీనిపై నేటితరం, భవిష్యత్ తరాల వారు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.