రూప్లో షమ్తోజీ కోలీ (Rooplo Shamtoji Kolhi)… గొప్ప యుద్ధ వీరుడు. కల్నల్ జార్జ్ ట్రైవిట్ నేతృత్వంలోని బ్రిటన్ సైన్యాన్ని ఏకంగా మూడు సార్లు ఓడించిన ధీరుడు. బ్రిటీష్ సామంతునిగా ఉంటే కావాల్సినంత ధనం ఇస్తామన్నా తిరస్కరించిన గొప్ప వ్యక్తి. రాణా కరణ్ సింగ్ గురించి సమాచారం ఇస్తే ప్రాణ బిక్ష పెడతామంటే నిరాకరించి చిత్రహింసలకు గురై ప్రాణాలు విడిచిన గొప్ప విశ్వాస పాత్రుడు ఆయన.
సింధు ప్రావిన్స్ (నేటి పాకిస్తాన్) లోని నగర్ పార్కర్ కు చెందిన రాజా చరణ్ సింగ్ కు చెందిన కొలి సేనలకు షమ్తోజీ కోలి కమాండర్ గా వున్నారు. ఆయన నేతృత్వంలోని 8000 మందితో కూడిన సైన్యం కరూన్ జహార్ పర్వతాల్లో బ్రిటీష్ కల్నల్ జార్జ్ ట్రైవిట్ నేతృత్వంలోని సైన్యాన్ని మూడు సార్లు ఓడించింది.
కోలీ సేనలు నీళ్లు తాగేందుకు వెళ్లగా నీళ్లు తాగేందుకు వెళ్లగా ఓ ప్రణాళిక ప్రకారం బ్రిటన్ సేనలు షమ్తోజీని బంధించాయి. వెంటనే అతన్ని జార్జ్ ట్రైవిట్ ఎదుట హాజరు పరిచాయి. క్షమాపణ చెప్పి బ్రిటీష్ రాజ్యానికి సామంతునిగా పని చేస్తే కావాల్సినంత ధనాన్ని ఇస్తామంటూ జార్జి ట్రైవిట్ ఆఫర్ ఇవ్వగా షమ్తోజీ దాన్ని తిరస్కరించారు.
కనీసం రాణా కరణ్ సింగ్ సోదా గురించి సమాచారం ఇస్తే క్షమాబిక్ష పెడతామన్నా దానికి షమ్తోజీ నిరాకరించారు. కరణ్ సింగ్ ఆచూకీ చెప్పాలంటూ షమ్తోజీ చేతి వేళ్లపై నెయ్యి పోసి నిప్పు అంటించినా ఆ కష్టాన్ని భరించాడే తప్ప కరణ్ సింగ్ గురించి విషయాలను బయట పెట్టలేదు. చివరకు అతన్ని బ్రిటీష్ సేనలు కరూన్ జహార్ పర్వతాల్లో ఉరితీశాయి.