వీరాంగన ఆశా సహాయ్(Veerangana Asha Sahay).. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash chandrabose) స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో చేరేందుకు ఏకంగా తల్లిదండ్రులు, పుట్టిన ప్రదేశాన్ని, సోదరిమణులను కూడా వదిలేసి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు భారతదేశం పట్ల ఎంతో ప్రేమను కలిగియున్న వారు కావడంతో ఆశాసహాయ్‌కు కూడా దేశభక్తి చాలా ఉండేది.
చిన్నతనం నుంచే భారతదేశ గొప్పతనాన్ని, దేశభక్తిని వారి తల్లిదండ్రుల నుంచి వంట బట్టించుకుంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఆమె ప్రదర్శించిన ధైర్యానికి గాను 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె పురస్కారం కూడా అందుకున్నారు. వీరాంగన ఆశా సహాయ్ జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వీరాంగన ఆశా సహాయ్.. 1928లో జపాన్ దేశంలోని కోబే(kobe) నగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇండియాకు చెందిన వారు. కానీ, జపాన్‌లో స్థిరపడ్డారు. అయినప్పటికీ వారికి దేశం పట్ల మమకారం ఏమాత్రం తగ్గలేదు.దేశభక్తి వారిలో ఉండటం కారణంగానే ఆశా జాతీయవాదం యొక్క దృఢమైన ఆదర్శాలతో పెరిగారు. ఆమె చిన్నతనం నుంచే పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని ఖండించడం నేర్చుకున్నారు. ఆశా తన సోదరీమణులతో కలిసి సాంప్రదాయ జపనీస్ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తిచేసింది.
అయితే, ఇండియా(INDIA)లో మలి స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న కాలంలో వరల్డ్ వార్ కూడా ప్రారంభమైంది. అప్పుడు అమెరికా-జపాన్ మధ్యలో ఉద్యమం జరుగుతోంది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వల్లే వరల్డ్ వార్-2 వచ్చిందని చరిత్రలో మనం చదువుకునే ఉంటాం. అంతకుముందే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడం కోసం బ్రిటీషర్స్‌కు తెలియకుండా జర్మనీ, జపాన్ దేశాల అధినేతలను కలిసి భారత్‌కు సాయం చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే 1943 జపాన్ రాజధాని టోక్యో(Tokyo)లో తొలిసారిగా నేతాజీని వీరాంగన ఆశా కలిశారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం పదిహేనేళ్లు. అయితే, ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని ఝాన్సీ రెజిమెంట్‌లో కొత్తగా ఏర్పడిన రాణిలో చేరేందుకు ఆశా సుభాశ్ చంద్రబోస్ అనుమతి కోరింది. తొలుత సంకోచించిన ఆ తర్వాత ధైర్యం చేసింది.= అయితే, ఆమె బలహీనమైన శరీరాకృతి చూసి తెల్లదొరలకు వ్యతిరేకంగా ఎలా ఫైట్ చేస్తుందని నేతాజీకి నమ్మకం కలగలేదు. కానీ, ఆమె దృఢ నిశ్చయానికి బోస్ చలించిపోయాడు. ఆ తర్వాత ఆమె పట్టుదల చూసి ఆజాద్ హిందు ఫౌజ్‌లో చేరేందుకు అనుమతి ఇచ్చాడు.
1945 సంవత్సరం 17ఏళ్ల వయసులో వీరంగన ఆశా సహాయ్ టోక్యో నుంచి బ్యాంకాక్‌కి కష్టతరమైన ప్రయాణం చేసింది. అనంతరం అక్కడ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్లో మహిళా సైనికురాలిగా శిక్షణా శిబిరానికి చేరుకుంది. ఆమె సైనిక జీవితం రొటీన్‌గా మారడంతో త్వరగా మెలకువలు నేర్చుకుంది. తన సీనియర్‌లకు సెల్యూట్ చేయడం నుంచి తన స్వదేశీయులతో కవాతు చేయడం వరకు నేర్చింది.
అయితే, జపాన్‌లో కంటే శిబిరంలో ఆహారం చాలా సులభంగా దొరికేది.వాస్తవానికి ఆమెకు హిందీ లేదా ఇంగ్లీషు రాకపోయేది కాదు.కొంతకాలానికి మెషిన్ గన్‌ని ఎలా కాల్చాలో నేర్చుకుని తన ప్లాటూన్‌తో కలిసి లాంగ్ మార్చ్‌లకు వెళ్లేది.
ఈ క్రమంలోనే జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబులు వేయడంతో ఆ దేశం రూపురేకలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘటన వీరాంగన ఆశను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆ రోజుల్లో వార్తల ప్రసారం కూడా చాలా ఆలస్యంగా ఉండేవి. అణుబాంబు దాడి జరిగిన సమయంలో తన పేరెంట్స్, తోబుట్టువులు టోక్యోలో ఉన్నారు.వారు కూడా బాంబు దాడిలో మరణించి ఉంటారని ఆశా సహాయ్ భావించింది.
అణుబాంబు దాడి ఘటన తర్వాత జపాన్ దేశం.. అమెరికాకు లొంగిపోవడంతో ఆగష్టు 1945లో నేతాజీ రహస్యంగా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వీరంగన ఆశా, ఆమె సహచరులు శిబిరంలో బంధించబడ్డారు. వారి ఆయుధాలను బ్రిటీష్ సైనికులు జప్తు చేశారు. కొంతకాలం పాటు వారు బంధీలుగా ఉండటంతో పాటు మిత్ర రాజ్యాల సైనికుల ద్వారా వేధించబడ్డారు.అయితే, ఆమె తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్ సింగపూర్ జైలులో ఉన్నట్లు ఆలస్యంగా కబురు అందింది.
1946లో వీరంగన ఆశా సహాయ్, సత్యదేవ్ సహాయ్.. ఆమె తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్ ఏప్రిల్ భారతదేశానికి తిరిగి వచ్చారు. వారికి ఘనస్వాగతం లభించింది. ఆమె ఇండియాకు తిరిగివచ్చాక ఆజాద్ హింద్ ప్రభుత్వం చేసిన వీరోచిత పోరాటల గురించి దేశంలో విరివిగా ప్రచారం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఆశా సహాయ్ చేసిన పోరాటాలకు గాను 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా లెఫ్టినెంట్ హోదా పేరుతో సత్కరించబడింది.