మరో గల్ఫ్ చీటింగ్ ఏజెంట్ బండారం బట్టబయలు అయ్యింది. జగిత్యాల కేంద్రంగా ఫేక్ వీసా(fake visa)లు క్రియేట్ చేస్తూ నమ్మిన వాళ్లను నిలువునా ముంచేస్తున్నాడో నకిలీ ఏజెంట్. ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఏజెంట్(Agent ) నుంచి తమ డబ్బులు ఇప్పించాలంటూ కోరుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా(Jagityala District) కేంద్రానికి చెందిన రాచకొండ మహేష్ ధర్మపురి రోడ్లో కొంత కాలంగా ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు.గల్ఫ్(Gulf) దేశాలకు వెళ్లి కొన్ని రోజులు కష్టపడితే తమ కుటుంబం ఆర్ధికంగా బాగుపడుతుందనకున్న కొంతమంది ఆశను క్యాష్ చేసుకున్నాడు నిందితుడు మహేష్.
అందిన కాడకు అప్పులు చేసి మహేష్ దఫాలుగా ఇచ్చేవారు. చాలా ఏళ్లుగా ఈ దందా నడుపిస్తున్న మహేష్ రూ.5 కోట్ల వరకు సంపాదించి ఉంటాడని అంచనా. ఇటీవల అదును చూసి అకస్మాత్తుగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
చివరకు బాధితులంతా కలిసి పోలీస్‌స్టేషన్(Police station)లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సైతం తమ గోడును పట్టించుకోవట్లేదని..యూరప్, దుబాయ్, కువైట్, థాయిలాండ్ దేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇచ్చి తమను మోసం చేశాడని..దీంతో రూ.వేలల్లో నష్టపోయినట్లు వారు చెప్పారు.మహేష్‌ని పట్టుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.