Telugu News » Warangal : ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్

Warangal : ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్ జెండర్

లైలా వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు.

by Prasanna
laila

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రచారకర్తగా తొలిసారి ఒక ట్రాన్స్ జెండర్ (Transgender) ఎంపికయ్యారు. ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. పేరున్న నటులు, సెలబ్రిటీలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంటుంది. అయితే ఈసారి వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్ లైలా (Laila) ను ఎంపిక చేసింది.

laila
ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. ఈసారి వీటిని చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వీటిపై అవగాహన కల్పించేందు ఓ ట్రాన్స్‌జెండర్‌కు లైలాకు అవకాశం దక్కింది.

లైలా వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సమస్యలపై ఎప్పటికప్పడు పోరాటాలు చేస్తుంది. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయించారు. అలా వారి కమ్యూనిటీ శ్రేయస్సుకు పాటుపడుతున్న లైలాను.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా నియమించింది.

ఓటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఐకాన్‌లను ఎంపిక చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. వరంగల్‌కు చెందిన ఓరుగంటి లైలాను ఎన్నికల సంఘం రాష్ట్ర ఐకాన్‌లలో ఒకరిగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించింది. లైలా ఓటర్ల నమోదును నిర్ధారించడంలో ప్రజలతో మమేకమవుతారని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి, వారిలో ఓటుపై అవగాహన కల్పించడానికి కూడా కృషి చేస్తుందన్నారు. ఆమె జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని CEO తెలిపారు.

You may also like

Leave a Comment