భారత్‌లో బ్రిటీష్ పరిపాలన కొనసాగుతున్న టైంలో ఎన్నో ఉద్యమాలు(Movements) జరిగాయి.ఎంతోమంది ప్రజలు వారికి ఎదురుతిరిగి జైళ్లల్లో (Jails) మగ్గిపోయారు.మరికొందరు తెల్లవారిని కూడా భయపెట్టించారు. అనంతరం వారు ఉరికంభం ఎక్కిన ఘటనలు అనేకం ఉన్నాయి.అయితే, అప్పట్లో భారతదేశం (INDIA) ఇప్పటిలా భౌగోళికంగా ఒకే దేశంగా ఉండేది కాదు. వివిధ రాజ్యాలుగా విభజించబడి ఉందేది. ఒక్కో రాజ్యానికి రాజులు ఉన్నా వారు తెల్లదొరలకు సామంతులుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రాజుల సైన్యంతో పాటు బ్రిటీష్ సేనలు కూడా అక్కడ ఉండేవి. వీరందరికీ ఆఫీసర్‌గా ఒక కమాండర్ ఇన్ చీఫ్ బ్రిటీష్ వ్యక్తి ఉండేవారు.
అప్పట్లో బ్రిటీష్ సైన్యంలో ఇండియన్ సైనికులు కూడా ఉండేవారు.వీరంతా తెల్లదొరల కోసం పనిచేసేవారు.బ్రిటీష్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు భారతీయులపై విచక్షణా రహితంగా దాడులు చేసిన సందర్భాలున్నాయి. అయితే, 1857లో బ్రిటీష్ వారు కూడా ఊహించని విధంగా భారతీయ సిపాయిలు తిరుగుబాటు చేశారు. నాటి నుంచే భారత్‌లో స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైందంటారు చరిత్రకారులు. ఇండియన్ హిస్టరీలో దీనినే తొలి ఫ్రీడమ్ ఫైట్‌గా అభివర్ణిస్తుంటారు. ఆ తర్వాతే గాంధీ,నెహ్రూ,వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వంటి స్వాతంత్ర్య ఉద్యమ మార్గదర్శకులు పుట్టుకొచ్చారు.
1857లో బ్రిటీష్ సైన్యంలో గొప్ప తిరుగుబాటు పుట్టుకొచ్చింది.దాదాపు 2200 మంది భారతీయ సిపాయిలు సికందర్ బాగ్‌తో సహా లక్నోలోని బ్రిటీష్ రెసిడెన్సీని ముట్టడించారు. ఆ విషయం తెలిసి బ్రిటిష్ సైన్యం కలకత్తా నుంచి కాన్పూర్ వైపు కవాతు చేసింది. ఈ ప్రస్తుతం కాన్పూర్, లక్నో టెరిటరీలు యూపీలోనే ఉన్నాయి.
బ్రిటీష్ సైన్యానికి చెందిన 93వ సదర్లాండ్ హైలాండర్లు(సైనికుల గుంపు) కాన్పూర్ చేరుకోవడానికి రైలు,ఎద్దుల బండ్లను ఉపయోగించారు.
తిరుగుబాటుదారులను భయపెట్టి అణచివేశారు. అయితే,విలియం ఫోర్బ్స్-మిచెల్, 93వ సదర్లాండ్ హైలాండర్స్తో ఒక సార్జెంట్(అధికారి) 1857 సిపాయిల తిరుగుబాటు (స్వాతంత్ర్య యుద్ధం)(FREEDOM FIGHT) గురించి తన పుస్తకం ‘రిమినిసెన్సెస్ ఆఫ్ ది గ్రేట్ మ్యుటినీ’లో రాసుకొచ్చాడు.
‘బనారస్ నుంచి మేము 2 లేదా 3 కంపెనీల బలగాలతో ముందుకు వెళ్లాము. అలహాబాద్, బనారస్ మధ్య ఉన్న ప్రాంతం(అప్పట్లో దేశంగా ఉండేది) వివిధ తిరుగుబాటుదారులతో ఆక్రమించబడుతోంది.వారి బెటాలియన్ చాలా ప్రమాదకరమైనది.
ఆ తిరుబాటుదారులు 120 మంది బ్రిటీషు వారిని పట్టుకుని చంపేసి, వారి మృతదేహాలను బావుల్లో పడేశారు. దీనినే మిచెల్ (MICTHEL)‘బీబీఘర్ ఊచకోత’గా పుస్తకంలో అభివర్ణించారు.ఈ విషయం తెలిసి కోపంతో ఊగిపోయిన బ్రిటీష్ వారు పెద్ద బెటాలియన్‌తో వచ్చి కాన్పూర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.బంధీగా ఉన్న సిపాయిలు,పౌరులను ఉరితీశారు.
లక్నోకు బెటాలియన్‌కు నాయకత్వం వహించిన బ్రిగేడియర్ విల్సన్ తన సేనలతో కాన్పూర్‌కు చేరుకున్నాడు.విల్సన్ 64వ రెజిమెంట్‌కు లీడర్‌గా కాన్పూర్ కమాండ్‌గా ఉన్నాడు.కాన్పూర్‌లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ‘నానా సాహిబ్’ను బంధించి చంపేశాడు. అయితే, విల్సన్ ఒక గూఢచారి ద్వారా నానాసాహెబ్ గురించి వివరాలు సేకరించి ఆ తిరుగుబాటును అణిచివేశాడు.
నానాసాహెబ్‌కు సంబంధించి అనేక రహస్యాలను బయటపెట్టిన ‘పెషావర్(ప్రస్తుతం పాక్‌లో ఉంది)కు చెందిన ఒక ముస్లిం’,లోకల్ గైడ్‌ను మిచెల్ కలిసి తిరుగుబాటును అణచివేసిన వివరాలు సేకరించాడు. నానాసాహెబ్ తన గూఢచారి ద్వారా బ్రిటీషర్స్కు ఫుడ్‌లో విషయం పెట్టి చంపాలని భావించాడు. అయితే,ఆ పథకం బెడిసికొట్టింది. వారు భయపడటంతో కథ అడ్డం తిరిగింది.
ఆ తర్వాత 1857 నవంబర్ నెలలో సికిందరాబాగ్ (సికందర్ బాగ్) వద్ద బ్రిటీష్ వారు ధ్యానంలో ఉన్న ఒక యోగిని చూశారు. దీనిని మిచెల్ తన పుస్తకంలో ‘నగ్న దౌర్భాగ్యం’గా అభివర్ణించారు. యోగి బ్రిటీష్ వారికి బాడీ బిల్డర్‌లా కనిపించాడు. అతను చూడటానికి గుండుతో వెనుక చిన్న పిలకతో ఉన్నాడు. యోగి శరీరమంతా బూడిదతో కప్పబడింది. ముఖానికి తెలుపు, ఎరుపు రంగులు పూసుకుని ఉన్నాడు. చిరుతపులి చర్మంపై కూర్చుని పూసల జపమాల లెక్కపెడుతున్నాడు.
యోగి బలమైన కండలు తిరిగినవాడు. ఈ క్రమంలోనే కాన్పూర్ కమాండెంట్ ‘జేమ్స్ విల్సన్’ యోగి(YOGI)పై తుపాకి గురిపెట్టి అతన్ని ‘పెయింటెడ్ స్కౌండ్రల్’ అని తిట్టాడు.’హంతకుడు’అని అభివర్ణించాడు. ఈ క్రమంలోనే బ్రిటీష్ దళంలోని డిప్యూటీ అసిస్టెంట్ క్వార్టర్ మాస్టర్ జనరల్, కెప్టెన్ ఏవో ‘మేనే’ విల్సన్‌ను అడ్డుకున్నాడు. హిందూ యోగులు ప్రమాదకరం వారికి దూరంగా ఉండాలని మేనే చెబుతుండగానే.. యోగి ఉన్నట్టుండి తుపాకితో కెప్టెన్ మేనే ఛాతీపై కాల్పులు జరిపాడు.ఇదంతా మెరుపు వేగంతో జరిగిందని, మేనే స్పాట్లో చనిపోగా.. బ్రిటీష్ సైన్యం ఒక్క క్షణం భయానికి గురైందని మిచెల్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. వెంటనే బ్రిటీష్ సైన్యం యోగిని చుట్టుముట్టి కాల్చి చంపారు. ఈ యోగి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతని లక్ష్యం ఏమిటి? అతని అసలైన పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ అతని లక్ష్యం నెరవేరింది. అతనొక నిజమైన అమరవీరుడు (పేరులేని యోగి – ఎ షహీద్ 14 నవంబర్ 1857) అని మిచెల్ రాసుకొచ్చాడు.