త్రిపుర నూతన గవర్నర్గా నల్లు ఇంద్ర సేనా రెడ్డి (Indra Sena Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజ్ భవన్ (Raj Bhavan) లో ఇంద్రాసేన రెడ్డతో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం మాణిక్ సాహాతో పాటు కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం కోసం గవర్నర్ దంపతులు బుధవారం త్రిపుర రాజధాని అగర్తలా చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు సీఎం మాణిక్ సాహ, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గార్డ్ ఆఫ్ హానర్ అందజేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
త్రిపురలో రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తనకు అప్పగించారని గవర్నర్ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. త్రిపుర ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించడంపై తన చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తన నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి మాణిక్ సాహ గవర్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను గవర్నర్ కు సీఎం వివరించారు. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని అధికారులకు నల్లు ఇంద్రా సేనా రెడ్డి సూచించారు.