తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TEt) ఫలితాల(Results)ను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో టెట్ ప్రాథమిక కీ(key)న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీ ని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. మొదటి కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
ఆ తర్వాత మార్పులు చేసి ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. టెట్ ఎగ్జామ్ పేపర్ 1ను శుక్రవారం నిర్వహించారు. ఈ పరీక్షకు 226744 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2కు 1,89,963 మంది అభ్యర్థులు హాజరైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా పేపర్-1 కు 84.12 శాతం, పేపర్-2 కు 91.1 శాతం మంది హాజరైనట్టు చెప్పారు.
పేపర్-1తో పోలీస్తే పేపర్-2 కఠినంగా వున్నట్టు అభ్యర్థులు తెలిపారు. గతంతో పోలిస్తే రెండు పేపర్లు కొంచెం సులువుగా వున్నాయన్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ చాలా కఠినంగా వున్నాయన్నారు. ఇక పలు చోట్లు ఓఎంఆర్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది.
కొన్ని చోట్ల ఒక అభ్యర్థి ఓఎంఆర్ ను మరో అభ్యర్థికి పంపిణీ చేసినట్టు సమాచారం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్ పేపర్ సెట్లు తారుమయ్యాయి. కొన్ని సెంటర్లలో రెండవ సెట్ కు బదులు మొదటి సెట్ ఇచ్చారు. ఆ తర్వాత పొరబాటు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే వేరే సెట్ ఇచ్చారు. కానీ అప్పటికే విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో ఆన్సర్స్ గుర్తించారు.