ఉన్నత చదువుల కోసం, మంచి భవిష్యత్‌ను రూపుదిద్దుకుందామని ఎన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికాలో(America) అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులు ఒక్కోక్కరుగా విగతజీవులుగా మారుతున్నారు. గడిచిన 12 నెలల కాలంలోనే ఏకంగా 13 మంది ఇండియన్ (Indians) స్టూడెంట్స్ (13 Students)అనుమానాస్పద స్థితిలో మృతి (Suspected death) చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థుల వరుస మరణాలు భారతదేశంలో ఉండే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే, చనిపోయిన విద్యార్థుల గురించి అక్కడి అధికారులు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తుంటుంది. అక్కడ ఉన్న టెక్నాలజీ, పోలిసింగ్ పరంగా చూసుకుంటే ఇతర దేశాలకంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అంతపెద్ద దేశంలో భారతీయ విద్యార్థులు ఉన్నట్టుండి కారణం లేకుందా ఎలా చనిపోతున్నారనేదే ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.
ఇప్పటివరకు మరణించిన వారిలో ఒక్కరు మినహా అంతా 26ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. వీరంతా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో హైయ్యర్ స్టడీస్ కోసం ఇండియా నుంచి వెళ్లినవారే ఉన్నారు.మరణించిన వారిలో 1.వరుణ్ మనీష్ చంద్ర (20), పూర్దే యూనివర్సిటీ ఇండియానా, 2.జాహ్నవి (23) సీటెల్,3. సాయెష్ వీరా(24) ఓహియో,4.వరుణ్ రాజ్ పూచా (24)వాల్పరైసో యూనివర్సిటీ, ఇండియానా, 5.ఆదిత్య(26)ఓహియో, 6.నికేష్ (21)హార్ట్ ఫోర్డ్, కనెక్టికట్, 7.దినేశ్(22) హార్ట్ఫోర్డ్, 8.వివేక్ సైనీ(25) జార్జియా, 9.అకుల్ దావాన్(22)ఇల్లీనియోస్, 10.నీల్ ఆచార్య(22), ఇండియానా, 11.శ్రేయాస్ రెడ్డి(21) ఓహియో, 12.సమీర్ కామత్(23),ఇండియానా, 13.అమర్ నాథ్ ఘోష్(34) ఎస్ టీ లూయిస్ మిస్సోరీ ఉన్నారు.
వరల్డ్ లోనే బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా పేరున్న ఎఫ్‌బీఐ(FBI) విద్యార్థుల మరణాలపై ఎటువంటి క్లూను ఛేదించలేకపోయాయి. అయితే, దీనివెనుక ఒక పాటర్న్ ఉందని చనిపోయిన విద్యార్థులంతా హిందూ వర్గానికి చెందిన వారని కొన్ని సంస్థలు ఆరోపిస్తున్నాయి. అమెరికాలో క్రమంగా హిందూ ఫోబియా పెరిగిపోతుందని అందుకే ఒకే వర్గానికి చెందిన స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
కాగా, ఇండియాలో ఒక అమెరికన్ స్టూడెంట్ లేదా పౌరుడు చనిపోతే నానా రచ్చ చేసే ఆ దేశంలోని సెనెటర్స్, మీడియా.. భారతీయ విద్యార్థుల మరణాలపై అక్కడి ప్రభుత్వం, మీడియా ఎందుకు మౌనం వహిస్తోందని కూడా కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై భారతప్రభుత్వం, విదేశాంగ శాఖ కూడా సీరియస్‌గా స్పందించాలని బాధిత పేరెంట్స్ కోరుతున్నారు.