Telugu News » Amith sha : రిజర్వేషన్లపై ఫేక్ ప్రచారం.. దాని వెనుక అతని హస్తముందన్న అమిత్ షా!

Amith sha : రిజర్వేషన్లపై ఫేక్ ప్రచారం.. దాని వెనుక అతని హస్తముందన్న అమిత్ షా!

ఫేక్ వీడియాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ(BJP)పై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Central home minister Amith sha) ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల(Reservations) విషయంలో హస్తం పార్టీ కావాలని తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.

by Sai
Fake campaign on reservations.. Amit Shah is behind it!

ఫేక్ వీడియాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ(BJP)పై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Central home minister Amith sha) ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల(Reservations) విషయంలో హస్తం పార్టీ కావాలని తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా తప్పుడు కథనాలు, ఆరోపణలు చేయిస్తోందని అమిత్ షా సీరియస్ అయ్యారు.

Fake campaign on reservations.. Amit Shah is behind it!

పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని, ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. గెలిచే పరిస్థితి లేనందునే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీ, అమేథీలో కూడా అభ్యర్థుల ఎంపీ అందుకే ఆలస్యం అవుతూందని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమథీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. అందుకే వయనాడ్‌‌కు పారిపోయారన్నారు. రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం వెనుక ఉన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని కేంద్ర హోంమంత్రి నొక్కి చెప్పారు.

ఆయన ఆదేశానుసారమే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లను పరిరక్షిస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి బలం పెరిగిందన్నారు. ఈసారి సీట్లు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. తొలి రెండు విడతల్లో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని స్పష్టంచేశారు. త్వరలోనే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటవు తుందన్నారు.

You may also like

Leave a Comment