Telugu News » PM Modi : వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ప్రధాని..!

PM Modi : వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ప్రధాని..!

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని రోజులు ఎంతో దూరంలో లేవని, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరాచకాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు..

by Venu
Prime Minister Modi's key comments on Hinduism.. Strong warning to those parties!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (Congress)పై ప్రధాని మోడీ విరుచుకుపడుతున్నారు.. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసి, ముస్లిం వర్గాలకు కోటా వర్తింపజేయాలని ప్రయత్నిస్తోన్నట్లు ఆరోపించారు.. బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని గురించి తమ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని తెలిపారు..

కానీ బీజేపీ (BJP) ప్రభుత్వం అలా జరగనివ్వదన్నారు. కర్ణాటక (Karnataka)లో మా పార్టీకి చెందిన ఎంపీలంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినవారే అని మోడీ తెలిపారు. ఇక అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ కు.. కర్నాటకలో ప్రభుత్వాన్ని నడపడం కష్టమైంది విమర్శించారు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆరాచకాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు..

మరోవైపు హుబ్బళ్లి (Hubballi)లో ఒకరిని ఒక అమ్మాయిని కత్తితో పొడిచినప్పుడు, ఇక్కడి పాలకులు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రయత్నించారని.. అందుకు ఆమె పరువుపై దాడి మొదలెట్టారని మండిపడ్డారు.. తన దుకాణంలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) వింటున్నవ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్న మోడీ (Modi).. కర్ణాటకలో ఛాందసవాదులు పెరిగిపోయారని ఆరోపించారు.

అదేవిధంగా గతంలో 18,000 కంటే ఎక్కువ గ్రామాలకు విద్యుత్ లేదని తెలిపిన ప్రధాని.. ఇప్పుడు దేశంలో కరెంటు రాని గ్రామం లేదన్నారు.. తమ ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించడం వల్ల 16% ఇళ్లకు మాత్రమే ఉన్న నీటి కనెక్షన్ సంఖ్య గత 5 సంవత్సరాలలో 75%కి పెరిగిందని వివరిస్తు.. ఎన్నికల్లో ఓడిపోయిన వారు నకిలీ వీడియోలతో ప్రజలను తప్పుడు మార్గంలో ఆలోచించేలా చేస్తున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు..

You may also like

Leave a Comment