ఉత్తరప్రదేశ్లోని బారాబంకి(Barabanki) జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందినట్టుగా తెలిసింది.. ఇంకా చాలా మంది భవనం శిథిలాల కిందే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది.
కాగా, శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 12 మందిని రక్షించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. బిల్డింగ్ కూలిన ప్రమాదం తర్వాత, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్, CDO ఏక్తా సింగ్, ADM అరుణ్ కుమార్ సింగ్ సమక్షంలో పోలీసులు, SDRF స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించారు.
శిథిలాల కింద చిక్కుకుని రక్షించిన సహాయక సిబ్బంది హుటహుటినా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఎనిమిది మందిని లక్నోకు రిఫర్ చేశారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.