మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ముంబైలోని గోరేగావ్ (Goregaon) ప్రాంతంలోని ఏడంతస్తుల భవనం (7 Storey Building) లో భారీగా మంటలు చెల రేగాయి. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలు అదవులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. మృతుల్లో ఒక పురుషుడు, ఐదుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. క్షత గాత్రుల్లో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు, ఒక మైనర్ ఉన్నట్టు వెల్లడించారు.
క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. క్షతగాత్రులను హెచ్ బీటీ ఆస్పత్రి, కూపర్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వివరించారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. భారీగా మంటలు ఎగసిపడటాన్ని గమనించి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఫైర్, పోలీసులు అధికారులు అక్కడకు చేరుకున్ని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.