తమిళనాడు (Tamilnadu) రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కు చేరింది. 60 మంది ప్రయాణికులతో టెన్ కాశీ నుంచి ఊటీకి వెళ్తున్న బస్సు (Bus) లోయ (Gorge) లో పడి పోయింది. కూనూరులోని మరపాలెం సమీపంలోకి రాగానే బస్సుపై డ్రైవర్ (Driver) నియంత్రణ కోల్పోవడం (Lossed Controle) తో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారలు వెల్లడించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో వున్న వారిని బయటకి తీసే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఊటీ, నీలగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సుమారు 35 మందికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు.
వారిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నీలగిరి జిల్లాలో బస్సు ఘటన వార్త విని తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధాని మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ ఎం. అరుణ తెలిపారు.