ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. వాయు నాణ్యత సూచీ (Air Quality Index) గణనీయంగా పడిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు ఆందొళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 309గా నమోదైనట్టు సఫర్ సంస్థ వెల్లడించింది.
వాయు నాణ్యత సూచీ అత్యంత పేలవంగా ఉన్నట్టు సఫర్ పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా ప్రకారం ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు నాణ్యత 326గా నమోదైంది. బురారీ ప్రాంతంలో ఏక్యూఐ 305గా నమోదైంది. ఢిల్లీలో గురువారం సరాసరి వాయు నాణ్యత సూచీ 256 గా నమోదైంది. నోయిడా గురుగావ్ లల్లో ఏక్యూఐ వరుసగా 208, 252గా నమోదైనట్టు అధికారులు తెలిపారు.
నోయిడా, గురుగావ్ రెండు నగరాల్లోనూ వాయు నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నారు. గురుగావ్‌లో వాయు నాణ్యత సూచీ గురువారంతో పోలీస్తే ఈ రోజు పెద్దగా మార్పులు కనిపించలేదు. అదే సమయంలో నోయిడాలో మాత్రం ఏక్యూఐ మరింత పడిపోయింది. గురుగావ్ లో గురువారం వాయు నాణ్యత సూచీ 230 ఉండగా, నోయిడాలో 191 ఉన్నట్టు వెల్లడించారు.
అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఆ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 పంట వ్యర్థాల దహనం ఘటనలు రిపోర్టు అయినట్టు అధికారులు అన్నారు.