Telugu News » Samantha: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చిన సమంత.. రీ ఎంట్రీ పై వీడిన సస్పెన్స్..!!

Samantha: ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చిన సమంత.. రీ ఎంట్రీ పై వీడిన సస్పెన్స్..!!

టాలీవుడ్ తోటలో గులాబీలా విచ్చుకొన్న సమంత.. ప్రస్తుతం సినిమాలు చేయదా అని బెంగపడుతున్న వారికి షాకిచ్చింది. మయోసైటిస్‌ ట్రీట్మెంట్ లో భాగంగానే అమెరికా వెళ్ళిన ఈ బ్యూటీ ముంబైలో సడెన్ గా ప్రత్యక్షం అయ్యింది.

by Venu

తెలుగు తెరపై ఏమాయ చేసావే (Emaya cesave) మూవీతో ఎంట్రీ ఇచ్చిన సమంత (Samantha) అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా తళుక్కుమని మెరిసింది. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన చిందులు వేసింది. ఈ మధ్యలో నాగ చైతన్య (Naga Chaitanya) తో పెళ్లి.. విడాకులు రెండు కూడా జరిగిపోయాయి. అయితే మయోసైటిస్‌ వ్యాధికి (Myositis disease) గురైన ఈ బ్యూటీ ఏడాది పాటు సినిమాల (movies)కు బ్రేక్ ఇవ్వనుందని నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. తీసుకున్న అడ్వాన్సులు కూడా నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది.

మరోవైపు మ్యాటర్ తెలిసిన కుర్రకారు గుండెలు ఊ అంటావా సమంత ఊహూ అంటావా అని కొల్లగొట్టుకుంటున్నారు.. అంతలా తన అందచందాలతో సినిమా అభిమానుల కళ్ళను తన వైపు తిప్పుకోంది సామ్.. ఇక టాలీవుడ్ తోటలో గులాబీలా విచ్చుకొన్న సమంత.. ప్రస్తుతం సినిమాలు చేయదా అని బెంగపడుతున్న వారికి షాకిచ్చింది. మయోసైటిస్‌ ట్రీట్మెంట్ లో భాగంగానే అమెరికా వెళ్ళిన ఈ బ్యూటీ ముంబైలో సడెన్ గా ప్రత్యక్షం అయ్యింది.

షార్ట్ హెయిర్ స్టైల్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న సమంత ఒక ప్రోమో షూట్ కోసం ముంబై వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తప్ప వేరే ఏది ఒప్పుకోని సామ్ ముంబైకి వచ్చి రాగానే షూటింగ్ లో ప్రత్యక్షమైంది. దీంతో సామ్ అభిమానుల ఆశలు మళ్ళీ చిగురించాయి.. కానీ సమంత ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నట్టు వినికిడి.

బాలీవుడ్ వైపు అడుగులు వేయాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు సినిమా వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. ఇక వేళ ఇదే జరిగితే టాలీవుడ్ లో సమంతను చూడడం ఇప్పట్లో జరగని పని. మరోవైపు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేయాలని ఆసక్తి చూపిస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి చూడాలి సమంత ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో..

You may also like

Leave a Comment