Telugu News » Assam: రెండో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి…. !

Assam: రెండో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి…. !

కొన్ని మతాలు రెండో వివాహానికి అనుమతించినప్పటికీ సర్వీసు నిబంధనల ప్రకారం వాళ్లు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

by Ramu

అసోం (Assam) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులెవరైనా రెండో వివాహం (Second Marriage) చేసుకోవాలంటే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని వెల్లడించింది. కొన్ని మతాలు రెండో వివాహానికి అనుమతించినప్పటికీ సర్వీసు నిబంధనల ప్రకారం వాళ్లు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

జీవిత భాగస్వామి జీవించి ఉండగా మరో వ్యక్తిని వివాహం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అసోం సర్కార్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా రెండో వివాహం చేసుకుంటే వారిపై చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల హెచ్చరించింది.

ఉద్యోగి మరణించిన తర్వాత ఆ ఉద్యోగి భార్యలిద్దరూ పెన్షన్ కోసం గొడవ పడుతూ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారని సీఎం హిమంత బిస్వ శర్మ చెప్పారు. అలాంటి వివాదాలను తీర్చడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోందన్నారు. వివాదాస్పద వాదనల కారణంగా చాలా మంది వితంతువులు పింఛన్‌లకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.

ఈ నిబంధనలు గతంలో కూడా ఉండేవని అన్నారు. కానీ వాటిని ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు ఆ నిబంధనలను తాము అమలు చేయాలని అనుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగి హిందువు లేదా ముస్లిం ఏ మతమైనా కానీ రెండో వివాహం చేసుకోవాలంటే ఖచ్చింగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లోకి రావాల్సిందేనన్నారు.

You may also like

Leave a Comment