Telugu News » కర్మయోగి.. ధర్మయోగి… సమర్థ రామదాసు…!

కర్మయోగి.. ధర్మయోగి… సమర్థ రామదాసు…!

. అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా దేశాన్ని సంఘటితం చేసేందుకు తన జీవితాంతం కష్టపడిన గొప్ప వ్యక్తి సమర్థ రామదాసు.

by Ramu

సమర్థ రామదాసు(Samartha Rama Das).. ఆధ్యాత్మిక గురువు.. వాగ్గేయకారుడు. అన్నిటికీ మించి ఛత్రపతి శివాజీ(Chatrapathi Shivaji)కి రాజకీయ గురువు. అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా దేశాన్ని సంఘటితం చేసేందుకు తన జీవితాంతం కష్టపడిన గొప్ప వ్యక్తి సమర్థ రామదాసు. హిందూ జాతిని జాగృతం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

1608లో ఔరంగబాద్‌ లోని జామ్ నగరంలో చైత్ర శుద్ధ నవమి(శ్రీరామ నవమి) రోజు సమర్థ రామదాసు జన్మించారు. ఈయన తండ్రి సూర్యాజీ పంత్ తోసల్, తల్లి రాణి బాయి. ఎనిమిదవ ఏటనే తండ్రి సూర్యాజీ పంత్ మరణించారు. దీంతో రామదాసు అంతర్ముఖుడిగా మారారు.

అనంతరం దేశాటనకు బయలు దేరారు. సమాజంలో కుల, మత వైషమ్యాలు పెరిగిపోవడం చూసి ఆవేదన చెందారు. ఈ భేద భావాలు తొలగించేందుకు సమాజాన్ని జాగృతం చేయాలని భావించారు. అందుకే కులమేదైనా.. ప్రజలందరిలో ఉండే ఆ పరమాత్ముడు ఒక్కడేనని ప్రభోదించారు. విదేశీ పాలకుల పాలనలో హిందువులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆవేదన చెందారు.

ఈ పరిస్థితులు తొలగి, ప్రజల ఇబ్బందులు పోవాలంటే హిందూ సమాజంలో శక్తి సామర్థ్యాల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. తన బోధనలతో ప్రజల్లో ధార్మిక, జాతీయ భావాలను పెంపొందించారు. ఈ క్రమంలోనే శివాజీ మహారాజ్ ను తీవ్రంగా ప్రభావితం చేశారు. హిందూ రాజ్య విస్తరణకు శివాజీని కార్యోన్ముఖున్ని చేశారు.

You may also like

Leave a Comment