Telugu News » Jai Shankar : ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించకపోతే భారత్ కు విశ్వసనీయత ఉండదు…..!

Jai Shankar : ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించకపోతే భారత్ కు విశ్వసనీయత ఉండదు…..!

ఇతర దేశాలపై ఉగ్రవాదం (Terrorism) ప్రభావం చూపుతున్నప్పుడు దానిని తీవ్రంగా పరిగణించకపోతే భారత్‌కు విశ్వసనీయత ఉండదని పేర్కొన్నారు.

by Ramu
Because we are big victims Jaishankar on Indias strong position on terrorism

భారత్ (India) ఉగ్రవాద బాధిత దేశమని, అందుకే ఉగ్రవాదంపై కఠినమైన వైఖరిని ఎంచుకుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jai Shankar) అన్నారు. ఇతర దేశాలపై ఉగ్రవాదం (Terrorism) ప్రభావం చూపుతున్నప్పుడు దానిని తీవ్రంగా పరిగణించకపోతే భారత్‌కు విశ్వసనీయత ఉండదని పేర్కొన్నారు.

Because we are big victims Jaishankar on Indias strong position on terrorism

ఇటీవల గాజాలో కాల్పుల విరమణపై ఐరాసలో ఓటింగ్ కు భారత్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక మంచి, బలమైన ప్రభుత్వం దేశ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. స్వదేశంలో సుపరిపాలన ఎంత అవసరమో, విదేశాంగ విధానంలో సరైన నిర్ణయాలు కూడా అంతే అవసరమని చెప్పారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది కాబట్టే తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు.

ప్రతి దేశం తన ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బలమైన ప్రభుత్వం, సుపరిపాలన అనేవి నాణేనికి ఉన్న బొమ్మ బొరుసుల్లాంటివన్నారు. గత కొన్ని ఏండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా భారత ఇమేజ్ చాలా పెరిగి పోయిందని చెప్పారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో భారత్ ఎంచుకున్న వైఖరిని ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు.

ఆ సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అప్పుడు పలు దేశాల ఒత్తిడికి తాము భయపడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఉంటే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎంత ఎక్కువగా ఉండేవో అందరూ ఆలోచించాలని చెప్పారు.

Because we are big victims Jaishankar on Indias strong position on terrorism

You may also like

Leave a Comment