Telugu News » IT Companies: ఉద్యోగులకు ఐటీ కంపెనీల షాక్…. 6 నెలల్లో 52వేల ఉద్యోగాలు ఫట్….!

IT Companies: ఉద్యోగులకు ఐటీ కంపెనీల షాక్…. 6 నెలల్లో 52వేల ఉద్యోగాలు ఫట్….!

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పది దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల సంఖ్య 21.1 లక్షలు గా ఉండేది.

by Ramu
TCS Infosys Wipro Employee headcount down 51744 in H1 FY24

HY1 2023-24లో భారత్‌లోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు (IT Companies) తమ వర్క్ ఫోర్స్ (Work Force) ను తగ్గించుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సమయంలో అందించిన డేటా ప్రకారం… ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పది దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల సంఖ్య 21.1 లక్షలు గా ఉండేది.


TCS Infosys Wipro Employee headcount down 51744 in H1 FY24

సెప్టెంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 20.6 లక్షల మందికి పడిపోయిది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 51,744 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అగ్రిగేటర్ ప్లాట్ ఫాం స్టాటిస్టా ప్రకారం…. తొమ్మిది దిగ్గజ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌టెక్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫాసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఐమైండ్ ట్రీ లల్లో ఉద్యోగుల సంఖ్య గత 25 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయిందని తెలిపింది.

దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాల ప్రకారం…. టీసీఎస్‌లో 2021-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 6,16,171గా ఉండగా, Hy1 2023-24 ఆర్థిక్ సంవత్సరంలో ఆ సంఖ్యను 6,06,985కు తగ్గిపోయింది. మొత్తం 9186 ఉద్యోగాల్లో కోత పెట్టింది. ఇక మరో దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో 2,62,626 నుంచి 2,44,707కు తగ్గిపోయింది. మొత్తం 17,919 ఉద్యోగులపై విప్రో వేటు వేసింది.

టెక్ మహేంద్ర సిబ్బంది సంఖ్య 1,63,912 నుంచి 1,50,604కు తగ్గించుకుంది. ఎల్ టీ ఐఎం మైండ్ ట్రీ 86,936 నుంచి 85,532కు, కాగ్నిజెంట్ 3,55,300 నుంచి 3,45,600, ఇన్పోసిస్ 3,46,845 నుంచి 3,28,764, హెచ్ సీఎల్ టెక్ 2,25,944 నుంచి 2,21,139, పరిసిస్టెంట్ సిస్టమ్స్ 22,889 నుంచి 22,842, ఎంఫాసిస్ 36,899 నుంచి 33,771కు తగ్గించుకున్నాయి.

You may also like

Leave a Comment