గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీ ( oil companies) లు షాక్ ఇచ్చాయి. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కమర్షియల్ సిలిండర్ (commercial LPG cylinders) ధరలను పెంచాయి. ఏకంగా రూ. 100 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. నూతన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1833కు చేరుకుంది.
ఇక అత్యధికంగా కమర్షియల్ సిలిండర్ ధర చెన్నైలో రూ. 1,999.50కు చేరుకుంది. ఆ తర్వాత స్థానంలో కోల్ కతాలో రూ. 1943 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 1,785.50 గా ఉంది. నాలుగు మెట్రో సిటీల్లో ఇదే అత్యల్ప ధర కావడం విశేషం.
గత రెండు నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు రెండు సార్లు పెంచాయి. అంతకు ముందు సెప్టెంబర్లో కమర్షియల్ సిలిండర్ పై రూ. 157ను చమురు కంపెనీలు తగ్గించాయి. ఆ తర్వాత అక్టోబర్ 1న కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 209లు చమురు కంపెనీలు పెంచాయి.
తాజాగా పెంచిన ధరలు కేవలం 19 కేజీల వాణిజ్య సిలిండర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీలు తెలిపాయి. గృహ వినియోగ సిలిండర్ లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు తెలిపాయి. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 929గా ఉంది.