స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేశారు. ఈ విషయం మనకి తెలుసు. దాదాపు 53 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన కోసం ప్రత్యేక వసతులని కల్పించాలని కోర్టు ఆదేశించింది కొద్దిరోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో మద్యంతర బెయిల్ వచ్చింది. విచారణ నవంబర్ 15 కి వాయిదా వేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి ఈ మధ్యంతర బెయిలు ఇచ్చారు. కుడి కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి ఉందట జూన్ నెలలో ఆయన ఎడమ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. మూడు నెలలు వ్యవధిలో కుడి కన్ను ఆపరేషన్ కూడా చేయాలి.
ఈ విషయాన్ని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు చెప్పడం జరిగింది కేవలం అనారోగ్య పరిస్థితుల కారణంగానే ఈ బెయిల్ ని వర్తింపజేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత పలు కండిషన్స్ ని కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టారు. స్వేచ్ఛగా తన ఇంట్లో ఉండవచ్చు అని చెప్పారు చికిత్స కోసం ఆసుపత్రికి కూడా వెళ్ళచ్చు. రాజకీయ సమావేశాల్లో కానీ నేతలకి భేటీలో కానీ పాల్గొనవద్దని చెప్పారు. అలానే ఆయన వెంట ఇతరు డిఎస్పీలని కూడా ఉంచాలని ఆదేశించారు. జడ్ ప్లస్ భద్రత నీ యధావిధిగా కొనసాగించవచ్చు కూడా. అయితే చంద్రబాబు మాత్రం రాజకీయాలకి సంబంధించినవి మాట్లాడడానికి వీలు లేదు ఇది కాస్త ఇబ్బందిని కలిగించే విషయం.
Also read:
కానీ జైలు నుండి బయటకు రాగానే మైక్ తీసుకుని మాట్లాడారు అసలు కోర్టు ఏం చెప్పింది అంటే మీ ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకుని మద్యంతర బెయిల్ ఇస్తున్నాము ఈ నెలరోజులు అవ్వగానే మళ్లీ కోర్టులో లొంగిపోవాలి అని ఇచ్చారు. సాక్షుల్ని ప్రభావం చేయకూడదు బయట ఫోన్లో మాట్లాడకూడదు అని కూడా కండిషన్స్ పెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం బయటకు వచ్చి మాట్లాడారు. నేను తప్పు చేయనివ్వను చెయ్యను అని నా కోసం మీరందరూ ముందుండి 52 రోజులు నా కోసం నిరసనలు చేస్తున్నందుకు నేను అదృష్టవంతుడిని ఇలాంటి అనుభవం ఏ నాయకుడికి రాదు ఇటువంటి అదృష్టం ఏ రాజకీయ నాయకుడు అనుభవించలేడు అంటూ మాట్లాడారు.