ఛత్తీస్‌గఢ్‌లో పీపుల్స్ పల్స్ (Peoples Pulse)సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ (congress)కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీ అవుతున్నారని సర్వే వెల్లడించింది. సీఎం భూపేశ్ భాఘేల్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు సర్వే వివరించింది.
మరోవైపు గతంలో పోలిస్తే ఈ సారి బీజేపీకి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈ సారి కాషాయ పార్టీకి 9 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం ఓట్లు రాగా ఈ సారి ఓట్ల శాతం 42 కు చేరుకునే అవకాశం ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది. సర్వే ప్రకారం….
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి సీట్లు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. సర్వే ప్రకారం అధికార పార్టీ కాంగ్రెస్ కు 55`నుంచి 60 సీట్లు వచ్చే అవకావశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీకి 28 నుంచి 34 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులకు రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
ముఖ్యంగా బీజేపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయి. భూపేశ్ భాఘేల్‌కు ధీటైన నేతలు బీజేపీలో కనిపించకపోవడం, రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి పూర్తిగా పట్టు లేకపోవడం వంటి కారణాల వల్ల అనుకున్నంత స్థాయిలో కమలం పార్టీ రాణించ లేకపోతోందని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీలే కాకుండా గోండ్ వాన్ గణతంత్ర పరిషత్, హమారా రాజ్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ క్రాంతి సేనా పార్టీలు బరిలో వున్నప్పటికీ వాటి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చని సర్వే తేల్చి చెప్పింది.