ఇస్రో (ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (Somanath) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్రో మాజీ చీఫ్ కే. శివన్ తన ప్రగతికి అడ్డు వచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఇస్రో చైర్మన్ పదవి రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. సోమనాథ్ తన ఆటో బయోగ్రఫీ‘నిలవు కుదిచ సింహంగల్’లో ఈ విషయాన్ని ఆయన రాసుకున్నారు.
2018లో ఇస్రో చైర్మెన్ పదవి నుంచి ఏఎస్ కిరణ్ కుమార్ రిటైర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయిందన్నారు. దీంతో ఆ పోస్టు కోసం శివన్, తన పేరును షార్ట్ లిస్టు చేశారని వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఇస్రో చైర్మెన్‌గా శివన్ నియమితులయ్యారని చెప్పారు. అదే సమయంలో విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా కూడా శివన్ కొనసాగారన్నారు.
డైరెక్టర్ పోస్టర్ తనకు ఇవ్వాలని పోరాడానన్నారు. కానీ శివన్ తప్పుకోలేదన్నారు. ఆరు నెలల తర్వాత ఆ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ జోక్యం చేసుకోవడంతో విక్రమ్ సారాబాయ్ డైరెక్టర్ బాధ్యతలు సోమనాథ్ కు దక్కాయి. చంద్రయాన్-2 విఫలం కావడానికి గల కారణాలను ఆయన పుస్తకంలో వెల్లడించారు.
చంద్రయాన్-2కు అవసరమైన పరీక్షలు చేపట్టలేదని, కేవలం తొందరపాటుగా ఆ మిషన్ మొదలు పెట్టారన్నారు. ఇస్రో చైర్మన్ గా శివన్ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా మరోసారి తన పదవి పొడిగించుకునేందుకు ప్రయత్నించారు. చంద్రయాన్ 2 మూన్ ల్యాండింగ్ సమయంలో ప్రధాని మోడీనిక కలవకుండా తనను అడ్డుకున్నారని పుస్తకరంలో తెలిపారు.
చంద్రయాన్2 ల్యాండింగ్ విషయంలో శివన్ తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. వాస్తవానికి అది సాఫ్ట్వేర్ లోపం వల్లే ల్యాండ్ కాలేదని సోమనాథ్ స్పష్టం చేశారు. ల్యాండర్‌తో కాంటాక్టు కాలేదని శివన్ చెప్పిన విషయాలు కరెక్టు కాదని తెలిపారు. కిరణ్ కుమార్ చైర్మెన్‌గా ఉన్న సమయంలో చంద్రయాన్2 మిషన్ ప్రారంభమైందన్నారు. కానీ ఆ తర్వాత శివన్ ఆ ప్రాజెక్టుకులో చాలా వరకు మార్పులు చేసినట్లు ఆరోపణలు గుప్పించారు.
అతిగా పబ్లిసిటీ ఇవ్వడం వల్ల చంద్రయాన్2పై చాలా ప్రభావం పడిందని వెల్లడించారు. చంద్రయాన్-3 విజయవంతం అయిన సమయంలో ప్రధాని మోడీ స్వయంగా వచ్చి తనను ప్రత్యేకంగా అభినందించడం సంతోషంగా అనిపించిందన్నారు. చంద్రయాన్-2 విఫలం కావడానికి ఎంక్వైరీ కమిటీ అయిదు కారణాలను చూపిందన్నారు.