ఇస్రో చీఫ్ (ISRO Chief) ఎస్. సోమనాథ్ (Somanath)వెనక్కి తగ్గారు. తన అటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. తాజాగా పుస్తకంపై వివాదం మొదలవడంతో తన ఆటో బయోగ్రఫీ ‘నిలవు కుడిచ సింహంగల్’పుస్తక ముద్రణను నిలిపి వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
గతంలో తన ప్రగతికి ఇస్రో మాజీ చీఫ్ కే. శివన్ అడ్డు వచ్చారంటూ పుస్తకంలో రాసుకు వచ్చినట్టు చర్చ జరుగుతోంది. తనకు ఇస్రో చైర్మన్ పదవి రాకుండా పలు రకాలుగా శివన్ అడ్డుకునే ప్రయత్నాలు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ స్పందించారు. ఓ సంస్థలో ఓ వ్యక్తి అత్యున్నత స్థానాన్ని చేరుకునే ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. తాను కూడా అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని పుస్తకంలో సోమనాథ్ వెల్లడించారు.
ఒక అత్యున్నత స్థానంలో కోసం ఎంతో మంది పోటీ పడవచ్చన్నారు. తాను కూడా ఆ ప్రత్యేక అంశాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశానన్నారు. ఈ విషయంలో నేను తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని వివరించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని పోరాటంతో పరిష్కరించాలనుకునే వ్యక్తులకు తన ఆత్మకథతో స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశానన్నారు.