Telugu News » S.Jaishankar: పరిస్థితి క్లిష్టంగా మారింది…. భారత్ కు సమర్థవంతమైన నాయకత్వం అవసరం….!

S.Jaishankar: పరిస్థితి క్లిష్టంగా మారింది…. భారత్ కు సమర్థవంతమైన నాయకత్వం అవసరం….!

ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు.

by Ramu

ఇజ్రాయెల్ (Israel)-హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ క్రమంలో తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు.

అదే సమయంలో అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని, పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఆ రెండు దేశాలు చర్చించాలని జై శంకర్ సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఎలీ కోహెన్‌తో ఆయన ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని ఎలీ కోహెన్ ట్వీట్టర్ లో వెల్లడించారు.

హమాస్ ఉగ్ర సంస్థకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ దేశానికి మద్దుతు ప్రకటించినందుకు భారత్ కు ఎలీ కోహెన్ కృతజ్ఞతలు తెలిపారు. తుచ్చమైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న ప్రజాస్వామ్యం యుద్దం తమదన్నారు. హమాస్ ఉగ్రసంస్థ అనేది ఐఎస్ఐఎస్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు భారత్ కెనడాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు దౌత్యపరమైన అవకాశాలు వున్నాయని జైశంకర్ అన్నారు. ఈ విషయంలో కెనడా-భారత్ మధ్య సంభాషణలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఒక్క మార్గం కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచం ఇప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని భారత విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కోబోతోందన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సరైన నిర్ణయాలు తీసుకునే, వ్యవస్థాగత మార్పులు చేయగల నాయకత్వం భారత్ కు అవసరమన్నారు.

You may also like

Leave a Comment