Telugu News » Sanjeev Varma : నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుపై భారత హైకమిషనర్ సంచలన వ్యాఖ్యలు….!

Sanjeev Varma : నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుపై భారత హైకమిషనర్ సంచలన వ్యాఖ్యలు….!

ఈ కేసును ఓ సీనియర్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే దెబ్బ తీశాడని సంచలన ఆరోపణలు చేశారు.

by Ramu

కెనడా (Canada)లో భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ (Sanjeev Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ కేసును ఓ సీనియర్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే దెబ్బ తీశాడని సంచలన ఆరోపణలు చేశారు.

కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ వర్మ మాట్లాడుతూ…. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను “భారత ఏజెంట్లు” హతమార్చారనే ఆరోపణలను రుజువు చేసేందుకు కెనడా సాక్ష్యాధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కేసు దర్యాప్తు విషయంలో కెనడాకు సహాయం చేయడానికి భారత్‌కు నిర్దిష్టమైన ఎలాంటి సమాచారాన్ని ఆ దేశం అందించలేదన్నారు. ఈ కేసులో అసలైన సాక్ష్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అసలు కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు.

ఇప్పటికే కేసు దర్యాప్తు కళంకితంగా మారిందని ఆరోపించారు. ఈ కేసులో భారత్ లేదా భారతీయ ఏజెంట్లు ఉన్నారని చెప్పాలంటూ ఓ ఉన్నత స్థాయి యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. అందుకే ఇలా భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

You may also like

Leave a Comment