Telugu News » Teethar Singh : 50 ఏండ్లలో 20 ఎన్నికల్లో పోటీ… విక్రమార్కునికి తాత ఈ వ్యక్తి……!

Teethar Singh : 50 ఏండ్లలో 20 ఎన్నికల్లో పోటీ… విక్రమార్కునికి తాత ఈ వ్యక్తి……!

ఐదు దశాబ్దాలుగా ఎన్నికల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

by Ramu
Rajasthan Man Has Lost 20 Elections In 50 Years He Will Contest Again

పట్టు వదలని విక్రమార్కు(Vikaramarkha)ల గురించి విన్నాం… గజనీ (Mahmud of Ghazni) దండయాత్రల గురించి చదివాం. కానీ రాజస్థాన్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం వేరే లెవల్. ఐదు దశాబ్దాలుగా ఎన్నికల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఊపిరి ఉన్నంత వరకు తన దండయాత్ర కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు ఆ వ్యక్తి.

Rajasthan Man Has Lost 20 Elections In 50 Years He Will Contest Again

జైపూర్‌కు చెందిన తీతర్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీగా పని చేస్తున్నారు. గత 50 ఏండ్లుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఇరవై ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి సారీ ఓటమి చెందారు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ ఆయన డిపాజిట్ దక్కించుకోవడం గమనార్హం.

తాజాగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన కరన్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అసలు ఇన్ని సార్లు ఎందుకు పోటీ చేస్తున్నారు మీడియా ప్రశ్నించగా… తాను ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వం భూమి ఉచితంగా ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

తాను ఏదో పాపులారిటీ కోసమో లేదా రికార్డుల కోసమో పోటీ చేయడం లేదన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు ఎన్నికలు ఒక ఆయుధం అని అన్నారు. తమ హక్కులను సాధించుకునే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. ఇటీవల ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

You may also like

Leave a Comment