Telugu News » Revanth : కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ ఫ్యామిలీ కుట్రలు!

Revanth : కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ ఫ్యామిలీ కుట్రలు!

రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ ను బొంద పెట్టాలనే కసి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్లమల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత తనదని అన్నారు.

by admin
Revanth Reddy Alampur Public Meeting

– ఆలంపూర్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా
– జోగులాంబ ఆలయానికి కేసీఆర్ ఇస్తానన్న..
– వంద కోట్లు ఏమయ్యాయి?
– బీఆర్‌ఎస్‌ ను బొంద పెట్టాలనే కసి..
– ప్రజల కళ్లల్లో కనిపిస్తోంది
– 3 గంటల కరెంటే ఇస్తానని నేను అనలేదు
– నిరూపిస్తే నామినేషన్ వెనక్కి తీసుకుంటా
– ఆలంపూర్ లో రేవంత్ రెడ్డి సవాల్

ఉచిత కరెంట్ విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). మూడు గంటల కరెంట్ చాలని తాను ఎక్కడా అనలేదని.. నిరూపిస్తే తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు. జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఆలంపూర్ కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్న రేవంత్.. ఆలంపూర్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని తెలిపారు. కేసీఆర్ జోగులాంబ ఆలయానికి ఇస్తానన్న వంద కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు కాంగ్రెస్​ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Revanth Reddy Alampur Public Meeting

ఉచిత కరెంట్ అంశంలో బీఆర్ఎస్ ది డ్రామా అని విమర్శలు చేశారు రేవంత్. రాష్ట్రంలో ఏ సబ్ ​స్టేషన్​ కైనా వస్తాం.. 24 గంటల కరెంట్​ వస్తున్నట్లు చూపించాలని ప్రశ్నించారు. పార్టీలు, గ్రూపులకు అతీతంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఆర్డీఏ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆలంపూర్ కోసం సంపత్ పోరాటం చేశారని.. ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని చెప్పారు.

రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ ను బొంద పెట్టాలనే కసి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్లమల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత తనదని అన్నారు. ‘‘ఇది మన పాలమూరు బిడ్డల జీవన్మరణ సమస్య.. ఆత్మగౌరవ సమస్య. ధరణి లేకపోయినా వైఎస్ హయాంలో రైతులకు ఆర్థిక సాయం అందలేదా? ధరణి స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్ తీసుకొస్తాం… రైతుల భూములు కాపాడుతాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం” అని అన్నారు రేవంత్. బీఆర్​ఎస్​ నాయకులకు ధరణి ఏటీఎంలా మారిందని ఆరోపించారు.

చల్లా వెంకట్రామి రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర బానిసలా మారిపోయారని విమర్శించారు రేవంత్. దొరగారి దొడ్లో జీతగాడిలా బతుకుతున్నారని ధ్వజమెత్తారు. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యే పోటీ జరుగుతోందని తెలిపారు. మహబూబ్ నగర్ లో 14 సీట్లు కాంగ్రెస్ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని డబుల్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.

You may also like

Leave a Comment