క్రికెట్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అతిక్రమించకుండా క్రికెట్ ని ఆడాలి ఒక్కోసారి ఆటగాళ్లకి కోపం రావడం సహజం. చాలామంది ఆటగాళ్లు గ్రౌండ్లో ఉన్నప్పుడే కోపాన్ని చూపిస్తూ ఉంటారు దాంతో వార్తల్లో ఎక్కుతూ ఉంటారు క్రికెటర్ల ప్రవర్తన సరిగా ఉండకపోయినా వాళ్ళ తీరు బాగోకపోయినా క్రికెట్ అభిమానులు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. తిట్టుకోవడం కొట్టుకోవడం ఇటువంటివి ఏం జరిగినా కూడా క్రికెట్ ప్రపంచమంతా వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటుంది అయితే కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. క్రికెటర్లు కూడా ఆట ఆడేటప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
బంగ్లాదేశ్ క్రికెట్ లో అత్యంత ప్రభావంతుడైన ప్లేయర్ ఎవరు అంటే మనకి ముందు గుర్తొచ్చేది షకీబ్ ఆల్ హసన్ ఆల్ రౌండర్ గా బంగ్లాదేశ్ ని నెట్టుకొస్తూ ఉంటాడు తన ఆటతో ఎంత పేరు తెచ్చుకున్నాడు తన ఇమేజ్ ని కోపంతో అంతే చెడగొట్టుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకపై మ్యాచ్లో అతని తీరు అసలు బాగోలేదు.
Also read:
A wide not given by the umpires makes Shakib Al Hasan furious. pic.twitter.com/KPgVWmYtrg
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2023
మ్యాచ్ టైంలో హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో మూడు నిమిషాలు టైం ముగిసిపోయింది టైం అవుట్ అయ్యారు. టైం అవుట్ గా ప్రకటించాలని బంగ్లాదేశ్ అపీల్ చేయడం అంత రూల్స్ ప్రకారం అవుట్ గా ప్రకటించడం షకీబ్ ని తర్వాత రిక్వెస్ట్ చేసుకోవడం అతను అందుకు ఒప్పుకోకపోవడం వంటివి జరిగాయి. ఆ టైంలో షకిబ్ ప్రవర్తించిన తీరు చూసి మండిపడుతున్నారు అంతా.