Telugu News » IPL : ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి.. ఒకే మ్యాచులో ఇద్దరు కెప్టెన్లకు భారీ ఫైన్!

IPL : ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి.. ఒకే మ్యాచులో ఇద్దరు కెప్టెన్లకు భారీ ఫైన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలోనే అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచుల్లోనూ స్లో ఓవర్ రేట్ (Slow Over Rate)కారణంగా ఏదో ఒక జట్టు కెప్టెన్‌కు మ్యాచు ఫీజులో ఐపీఎల్ మేనేజ్మెంట్ కోత విధిస్తూ వచ్చేది.కానీ, తొలిసారిగా ఒకే మ్యాచులో ఇద్దరు కెప్టెన్లకు మ్యాచు ఫీజులో కోత పడింది.

by Sai
For the first time in the history of IPL.. a huge fine for two captains in the same match!

శుక్రవారం జరిగిన చెన్నయ్(Chennai super Kings) సూపర్ కింగ్స్ జట్టు, లక్నో సూపర్ జెయంట్స్ (Lucknow super Giants) జట్ల మధ్య లక్నో వేదిగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నయ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కేవలం 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన లక్నోజట్టు కేవలం 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 8 వికెట్ల భారీ తేడాతో నిర్దేశిత లక్ష్యాన్ని లక్నోజట్టు ఛేదించింది. లక్నో విజయంలో కెప్టెన్ కెఎల్ రాహుల్ 82(53), డికాక్ 54(43) కీలక పాత్ర పోషించారు.

అయితే, ఇరు జట్లు స్లో ఓవర్ రేట్‌కు కారణం కావడంతో బీసీసీఐ(BCCI) ఇరు జట్ల కెప్టెన్లకు రూ.12 లక్షల చొప్పున ఫైన్ విధించింది. కాగా, ఈ మ్యాచులో లక్నో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్, చెన్నయ్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment