Telugu News » Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. ధోని భార్య పోస్ట్ వైరల్..!

Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. ధోని భార్య పోస్ట్ వైరల్..!

బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్త‌గా నా రిక్వెస్ట్ ఇదే" అని సాక్షి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది. ఈ పోస్టుతో సాక్షి సోదరుడు తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

by Mano
Sakshi Dhoni: 'Baby is on the way'.. Dhoni's wife's post goes viral..!

చెన్నై మాజీ సార‌థి ఎంఎస్ ధోనీ(MS Dhoni) భార్య సాక్షి(Sakshi) పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. “ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వ‌ర‌గా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్త‌గా నా రిక్వెస్ట్ ఇదే” అని సాక్షి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది. ఈ పోస్టుతో సాక్షి సోదరుడు తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

Sakshi Dhoni: 'Baby is on the way'.. Dhoni's wife's post goes viral..!

దీంతో మిస్టర్ కూల్ ధోనీ అభిమానులంతా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ధోనీ మామ కాబోతున్నాడంటూ విష్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. నిన్న‌టి మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కు దిగి ఎదుర్కొన్న మొద‌టి బంతినే బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఆ స‌మయలో స్టాండ్‌లో ఉన్న సాక్షి ఇచ్చిన రియాక్ష‌న్ కూడా నెట్టింట బాగా వైర‌ల్‌గా మారింది.

ఈ సీజన్‌లో ముందు బ్యాటింగ్‌ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఛేదనలో మాత్రం వరుసగా రెండోసారి చేతులెత్తేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ 78 ప‌రుగుల తేడాతో విజయం సాధించించి పంతం నెగ్గించుకుంది. న్నై నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌తో మ్యాచ్‌మయ గ‌త‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ చేతిలో ఓట‌మి కాగా సీఎస్‌కే ఈసారి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ సీజ‌న్‌లో సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచులు ఆడి 5 విజ‌యాలు సాధించింది. ప్ర‌స్తుతం 10 పాయింట్ల‌తో ఉన్న చెన్నై పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానంలో కొన‌సాగుతోంది.

You may also like

Leave a Comment