బీజేపీ (BJP)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆదివాసీలను కాంగ్రెస్ (Congress) కౌగిలించుకుంటే, కాషాయ పార్టీ మాత్రం ఆదివాసిలపై మూత్రం పోసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గిరిజనులను కాంగ్రెస్ ‘ఆదివాసీ’అని పిలిచిందన్నారు.
కానీ బీజేపీ మాత్రం వనవాసి అని పిలుస్తోందన్నారు. ఆదివాసీలకు తాము హక్కులు కల్పించామన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆదివాసీ హక్కులను లాక్కొందన్నారు. తాము ఆదివాసీలను ఆదరించామన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆదివాసీలపై మూత్ర విసర్జన చేసి వీడియోలు తీశారని, వాటిని వైరల్ చేసిందన్నారు.
ఈ ఘటలను దేశం మొత్తం గమనించిందన్నారు. నిన్న కూడా చత్తీస్ గఢ్‌లో రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకు పడ్డారు. బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో ప్రతి సారి ఆదివాసీలను వనవాసీ అని సంభోదిస్తున్నారని అన్నారు. వనవాసికి, ఆదివాసికి చాలా తేడా ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓ వీడియో వైరల్ అయింది. సిద్ది ప్రాంతంలో ఓ గిరిజనుడిపై స్థానిక బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేసినట్టు వీడియోలో కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి. ఈ క్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు.