తృణ ధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తు ప్రధాని మోడీ (PM Modi) సాహిత్య సహాయం అందించిన పాట గ్రామీ అవార్డు (Grammy Award)లకు నామినెట్ అయింది. తృణ ధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తు ప్రధాని మోడీ ‘అంబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్’ టైటిల్ తో ఓ పాటను జూన్‌లో విడుదల చేశారు. హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
ఈ పాట చాలా పాపులర్ అయింది. ఈ పాటను ఇండో అమెరికన్ అవార్డు విన్నింగ్ సింగర్ పాల్గుణి షా, తన భర్త గౌరవ్ షాతో కలిసి పాడారు. ఈ పాటకు ప్రధాని మోడీ కూడా గొంతు కలిపారు. అదే సమయంలో ఈ పాటకు ప్రధాని మోడీ సాహిత్య సహకారాన్ని కూడా అందించారు. పలు సందర్బాల్లో మిల్లెట్స్ గురించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగాలను కూడా ఇందులో జోడించారు.
ఈ పాట గ్రామి అవార్డుకు నామినెట్ అయిన విషయాన్ని సింగర్ పాల్గుణి షా తెలిపారు. గతేడాది తాను గ్రామీ అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోడీని ఢిల్లీలో కలుసుకున్నట్టు ఆమె చెప్పారు. ఆ సమయంలోనే తృణ ధాన్యాలపై పాట పాడితే బాగుంటుదని ఒక ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు.
సమాజంలో మార్పు తీసుకు రావడానికి, మానవళికి మంచి సందేశం పంపేందుకు సంగీతం ఎలా ఉపయోగపడుతుందని అప్పుడు తమ మధ్య చర్చ జరిగిందన్నారు. అప్పుడు ఆకలిని అంతం చేసే ఒక గొప్ప సందేశంతో కూడిన పాటను రాయాలని ప్రధాని మోడీ తనకు సూచించారని ఆమె వెల్లడించారు.