Telugu News » బస్సు, ఓమ్ని వ్యాన్ ఢీ…..బస్సులో 60 మంది….!

బస్సు, ఓమ్ని వ్యాన్ ఢీ…..బస్సులో 60 మంది….!

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

by Ramu

తమిళనాడు ( Tamilnadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి (National Highway)పై రెండు బస్సులు ఒక దానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు, చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఓమ్ని బస్సు చెట్టియప్పనూర్ వద్ద ఒక దానితో ఒకటి ఢీ కొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

మృతులను గుడువంచెర్రికి చెందిన రితిక (32), మహమ్మద్ ఫిరోజ్ (37), వనియంబడి, బస్సు డ్రైవర్ కే.ఎలుమలై (47)గా గుర్తించారు. మృతుల్లో ఏపీలోని చిత్తూరుకు చెందిన అజిత్ (25) కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఓమ్ని బస్సు డ్రైవర్ ఎన్. సయ్యద్ కు తీవ్రగాయాలు కాగా ఆయన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడని పేర్కొన్నారు.

మరోవైపు యూపీలోని గురుగావ్ ప్రాంతంలో కారును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. జైపూర్ నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న సీఎన్ జీ సిలిండర్లలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో కాలిపోయారు. కారును ఢీ కొట్టడంతో ట్యాంకర్ అదుపు తప్పి మరో వ్యాన్ ను ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ లోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment