ప్రధాని మోడీ (PM Modi) ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి (Deepavali) జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ప్రాంతంలో సైన్యంతో కలిసి ఆయన దీపావళి సంబురాల్లో పాల్గొన్నారు. జవాన్లకు ప్రధాని మోడీ స్వీట్లు పంపిణీ చేశారు. వారితో చాలా సేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు.
లెప్చాలో సైనికులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరిగా ధృడంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుందని అన్నారు. దేశంలో శాంతిని సృష్టించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. అందులో సైనికుల పాత్ర అత్యంత ప్రధానమైందన్నారు.
500 మందికి పైగా మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇచ్చామన్నారు. నేడు మహిళా పైలట్లు రాఫెల్ లాంటి యుద్ధ విమానాలను నడుపుతున్నారని వెల్లడించారు. రాముడు ఉండే చోట అయోధ్య అని చెబుతారని… కానీ తనకు భారత ఆర్మీ సిబ్బంది ఉన్న ప్రదేశం దేవాలయం కంటే ఎక్కువ అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన సైన్యం ఎన్నో యుద్దాలు చేసిందన్నారు. ఆ యుద్దాల్లో సైన్యం దేశ హృదయాలను గెలుచుకుందన్నారు. అంతర్జాతీయ శాంతి మిషన్ లో మన సైన్యం వల్లే భారత గ్లోబల్ ఇమేజ్ పెరిగిందన్నారు. అంతకు ముందు ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.